Suryaa.co.in

Entertainment

పునీత్ రాజ్ కుమార్ మృతిపట్ల బాలకృష్ణ దిగ్భ్రాంతి

కన్నడ సినీనటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం పట్ల తెలుగు సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘‘అప్పు(పునీత్ రాజ్ కుమార్) మృతితో గొప్ప స్నేహితుడిని కోల్పోయాను. ఆయన మృతి కన్నడ చలనచిత్ర పరిశ్రమకు తీరని నష్టం.
బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి ప్రముఖ హీరోగా, గాయకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, నిర్మాతగా అనితర ప్రతిభ ప్రదర్శించాడు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందాడు.
రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

LEAVE A RESPONSE