Suryaa.co.in

Entertainment

కోట విలనీతో హీరోలకు కటకట!

గురాలపై కత్తులు
పట్టుకు తిరిగే జానపదులు..
రౌడీలను వెంటేసుకుని
గుహల్లో సంచరించే
ముఖం గాటు మనుషులు..
చేతిలో తుపాకీ..
పెద్దపెద్ద బూట్లు..
కళ్లకు గంతలు..
కౌబాయ్ హీరోకి సాటిగా
అన్నిటా అతడికి పోటీగా
సంచరించిన ఇంగ్లీషు
టైపు దుర్మార్గులు..
వీళ్లకు కాలం చెల్లి
సాదాసీదాగా కనిపిస్తూ
అన్నీ నీచపు పనులు..
క్రౌర్యపు ఆలోచనలు చేసే..
ఈశ్వరుడైనా పట్టలేని
ఇంటి దొంగ విలనీకి
వందల సినిమాల రూపం..
దుర్మార్గానికి పెట్టని కోట
విలనీ కోసమే పుట్టిన కోట
అప్పుడప్పుడూ
నవ్వుల పూదోట..!

ఎనే..
ఈ ఫోనెవడు
కనిపెట్టాడండి బాబూ..
నాకేంటి.. మరి నాకేంటి..
అదోలాంటి యాసతో..
జీర గొంతుతో..
చిత్రమైన భావ ప్రకటనతో..
విలనీ చైర్ టు
క్యారెక్టర్ ఆర్టిస్ట్ చైర్..
మరదే కోట స్టైల్..!

అబ్బో..ఇంత పిసినారా..
అహ నా పెళ్ళంట..
రాజుల కాలం నాటి భాష..
గుండె ఘోష..
చూపులు కలిసిన శుభవేళ
అబ్బ..గుండుతో ఎంత
దుర్మార్గంగా కనిపిస్తున్నాడో..
గణేష్..
ఇలాంటి పాత్రలే కాదండోయ్
ఇద్దరు పెళ్ళాలకూ పుట్టిన ఇద్దరు కొడుకులూ తగవులు
పడుతుంటే ఆర్నెల్లు ఇక్కడ
ఇంకో ఆర్నెల్లు అక్కడ..
నలిగిపోయే బృందావనం ముసలాడు…
కొడుక్కి కొడుకు పుట్టాలని
తాపత్రయపడి ఆ కొడుక్కి పుట్టిన ఇంకో కొడుకుని
తెచ్చిపెట్టుకున్న
చాదస్తపు ఇంటిపెద్ద..
ఈ కోట కోటాలో
ఎన్ని అవార్డులో..
అదే కోట ఖాతాలో
ఎన్ని పాత్రలో..
నలభై నాలుగు సంవత్సరాల
జైత్రయాత్రలో..!

వయసు పైబడి
దూకుడు తగ్గినా
ఇంకా తీరని తృష్ణ..
లీడర్ ను తయారు చేస్తూ..
జులాయితో జతకట్టి..
ఇంకా వేషాలే..
స్టేట్మెంట్లతో మీనమేషాలే!

మొత్తానికి కోట కసాట..
నటనతో సయ్యాట..
పేలే మాట..
వయసు ముదిరినా
తప్పని ఊగిసలాట..
తెలుగు సినిమాకి
వరాల మూట..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

LEAVE A RESPONSE