Suryaa.co.in

Entertainment

కోర్ట్ ను తప్పదోవ పట్టించిన బిగ్ బాస్

– నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

తెలుగు యువ శక్తి అధ్యక్షులు, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి బిగ్ బాస్ 3 జరుగుతున్న సందర్భంగా 2019 మొదట తెలంగాణ హైకోర్టు నందు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ నందు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటీగేషన్ (pil ) దాఖలు చేయడం జరిగింది .ఆ పిల్ నందు ..నేను బిగ్ బాస్ సెలెక్షన్స్ పేరుతో అమ్మాయి లను వంచుచున్నారని. ఈ బిగ్ బాస్ షో వలన సమాజం నాకు ఎంతో హానికరమని. ముఖ్యంగా యువత పెడు మార్గం లో నడిచేదానికి ఈ షో కారణం అవ్వుతుందని ఏందోరో తల్లిదండ్రుల ఆవేదన ను తెలిపారని కాబట్టి, ఈ షో ని రద్దు చేయాలని ..24 గంటలు షూట్ చేసి కేవలం ఒక గంట మాత్రమే ప్రసారం చేయటం .ఓటింగ్ పేరుతో జరుగుతున్న అవకతవకలను. గేమ్ షో పేరుతో అసభ్యకర సన్నివేశాలు, హగ్గులు, ముద్దులు పెట్టుకున్నారన్న విషయాలపై అభ్యంతరం తెలుపుతూ 2 కోర్ట్ లను ఆశ్రయించట0 జరిగింది.

మొదటగా తెలంగాణ హై కోర్ట్ 19-12-2019 ..కేస్ నెంబర్ 85 ఆఫ్ 2019 ఈ కేస్ ను బిగ్ బాస్ 3 సెషన్ అయ్యిపోయినది కాబట్టి కేస్ విచారణ ప్రస్తుతానికి ఇక అవసరం లేదు కాబట్టి కేస్ కొట్టి వేస్తూ ..జస్టీస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్. అభిషేక్ రెడ్డి ల ధర్మాసనం తీర్పు ఇస్తూ ఈ బిగ్ బాస్ షో లపై కొన్ని వాఖ్యలు చేయటం జరిగిందని ఈ షో లు టెలికాస్ట్ కాకుండా ఆపేసే హక్కులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్ ను దుష్టిలో పెట్టుకుని వారి ఇంటిలో ఇంటర్నెట్ కటర్స్ ను ఉపయోగించలని తెలపటం జరిగిందని ..ఆ తరువాత కోర్ట్ .కోర్ట్ కు జడ్జిమెంట్ లు ఒకే రక0గా ఉండవు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు కేస్ వేసి ప్రజాఉద్యమం లో భాగంగా విజయవాడ ధర్నా చౌక్ నందు ధర్నా చేయడ0 జరిగింది . ఇది జరిగిన స0ఘటన ,కానీ నిన్న జరిగిన వాదనలో హైకోర్టును తప్పుదోవ పట్టించింది స్టార్ మా తరపు లాయర్ మోహన్ రెడ్డి నేను హైదరాబాద్ కోర్టులో కేసు విరమించుకున్నానని తెలిపారు.అది సత్య దూరం. నేను బిగ్ బాస్ కు వ్యతిరేకంగా వేసిన కేసు వెనక్కు తీసుకోలేదు.

కోర్టును తప్పుదోవ పట్టించారు లాయర్
బిగ్ బాస్ -3కు వ్యతిరేకంగా అప్పుడు నేను కేసు వేశాను. అప్పటికి ఆ సెషన్ అయిపోయింది కాబట్టి కేసు కొట్టివేశారు. అంతేగానీ నేను కేసును విరమంచుకున్నా అనేది నిజం కాదు. బిగ్ బాస్ షో యువతను పెడదారి పట్టిస్తోంది. ఆ షోలో డ్రగ్స్ కూడా వాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని కూడా ఆ షో షూటింగ్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ , డిజీపీ, పోలీసు కమిషనర్, డ్రగ్స్ నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఈ షో షూటింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో నిఘా విభాగం ను ఏర్పాటు చేయాలని కోరుతూ, ముఖ్యమంత్రి కి అధికారులకు త్వరలో విన్నవించనునట్లు .. ఈ షో నిర్వాహకులకు దమ్ముంటే ప్రజల మధ్య 2 రాష్ట్రలలో ప్రజా కోర్ట్ లో ఓపెన్ డేబిట్ పెట్టి , మీ షో పై ప్రజల్లో ఉన్న అభిప్రాయంను తెలుసుకోవాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటనను విడుదల చేశారు.

LEAVE A RESPONSE