Suryaa.co.in

Entertainment

సీనియర్ కమెడియన్ కేజే సారథి కన్నుమూత

ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఎన్నో చిత్రాలలో తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కేజే సారథి ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ, లంగ్స్ సమస్యలతో బాధపడుతున్నారు. నెల రోజుల నుంచి హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి రాత్రి 2.32 గంటలకు ఆయన మృతి చెందారు.

కేజే సారథి 1942 జూన్ 26న పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండలో జన్మించారు. ఆయన పూర్తి పేరు కడలి విజయ సారథి. ఆయన 350కి పైగా చిత్రాలలో నటించారు. అంతేకాదు నిర్మాతగా మారి కృష్ణంరాజుతో ‘ధర్మాత్ముడు’, ‘విధాత’, ‘శ్రీరామచంద్రుడు’, ‘అగ్గిరాజు’ చిత్రాలను నిర్మించారు. కేజే సారథి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE