Suryaa.co.in

Entertainment

ఆకట్టుకునే బాణి..కోదండపాణి..!

ఇదిగో..దేవుడు చేసిన బొమ్మ
కట్టిన పాటలేమో పదికాలాలు..
కోదండపాణి..
అందమైన బాణి..
చక్కటి వాణి..
బాలుకి బోణి..
తను లేకపోయినా
తన సంగీతంతోనే
ఆయన కీర్తి చలామణీ!

గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు
ఏలిన రాజ్యం..
ఇది సమతకు
మమతకు సంకేతం..
సాహిత్యం గొప్పదే..
సందేశం ఉన్నతమే..
సంగీతం..
అబ్బో ఆ మెలోడీ
కోదండపాణికే అంకితం!

రామకథ మొత్తాన్ని
ఒకే పాటలో వివరించిన
అద్భుత గీతం..
ఎంత హాయిగా సాగిందో
తానే తొలి రాగం పలికించిన
ఎస్పీ బాలు రసరమ్యంగా
ఆలపిస్తుంటే
ఆ సంగీత దర్శకునికి
పుత్రోత్సాహం..
గంధర్వ గాయకునికి
ఆ పాట..గురువు ప్రోత్సాహం
నననవోత్సాహం..
ఆ ఇద్దరి సమ్మేళనం
సంగీత ఉత్సవం!

సినిమా రంగంలో
మర్యాదరామన్న..
ఆలయాన వెలసిన
ఆ దేవుని రీతి..
ఆ ఒక్క పాటతో
ఆవిష్కరించి ఇల్లాలి నిరతి
బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుక..
ఈ పాటలో విషాదాన్ని..
ఏవమ్మ జగడాల వదినమ్మో
ఎగిరెగిరి పడతావు ఏందమ్మో..
ఈ గీతంలో అల్లరి…
ఏమి వింత మోహమో..
ఒకే పాటలో
నలుగురు గాయకుల
సమ్మోహనం..
మనసా..కవ్వించకే నన్నిలా..
సుశీల గొంతు
మ్రోగింది వీణలా..
బాబూ వినరా అన్నాదమ్ముల కథ ఒకటి..
అదే పాటలో
రెండు భావాలు..భావనలు..
ప్రతి పాటకు భలే బాణి..
ఫక్తు సంప్రదాయ
సంగీత ప్రాణి..
మన కోదండపాణి..!!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE