Suryaa.co.in

Entertainment

తెలుగు సినిమా బాహుబలి

నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు..
పాన్ ఇండియా అనే పదం ప్రాచుర్యం పొందింది.
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు..
ఇండియా బాక్స్ ఆఫీస్ పులకరించి నీకు నీరాజనం పలికింది..
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు
తెలుగు 70MM వెండితెర మర్చిపోయిన ఆరడుగుల రూపం పునః ప్రతిష్ఠ జరిగిందని మురిసిపోయింది..
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు..
తెలుగు సినిమా హీరోని గ్రీక్ హీరోలా పోల్చుకుని నేషనల్ మీడియా మురిసిపోయింది..
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు
వెండితెర మర్చిపోయిన రాచరిక కధలకు మాహిశ్మతితో కోట కట్టావు..
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు..
వెండితెరపై ఆదిపురుషుడు మళ్ళీ అవతరించబోతున్నాడు. సూర్యవంశ ఖ్యాతి ,వైభవం మేము అనుభవించేలా చేస్తున్నావు..
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు..
బాషా,ప్రాంతం, రాష్ట్రం తేడా లేకుండా దేశం అంతా నీ సినిమా గురించి వేచి ఉండేలా చేసావు..
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు..
నువ్వు తెరపై పోరాటం చేస్తుంటే సాధారణ బాగ్రౌండ్ స్కోర్ మాచ్ అవ్వక ..హై క్వాలిటీ BGM ట్రాక్ లు పుట్టాయి..
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు..
అప్పటివరుకూ భారతీయ సినిమా చూడని సుధీర్ఘ (యాక్షన్) యుధ్ధం కళ్ళార్పకుండా చూసాము..
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు..
తెరపై నీ విగ్రహానికి చూసి ఇతర హీరోలు జిమ్ వైపు పరుగులు పెట్టేలా చేసావు..
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు..
ఫారిన్ లో నీ అభిమానుల కోసం నీ పోస్టర్ లు దేశాలు దాటాయి. అంతర్జాతీయ మీడియా నీ నామ స్మరణ చేసింది..
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు..
తెరపై సినిమాటిక్ ఎలివేషన్లు , స్టైల్ , కాస్ట్యూమ్స్, మేకప్,డైలాగ్స్ తో పుట్టే హీరోల మధ్య సహజంగానే హీరోలా కనపడే నిన్ను నువ్వు పరిచయం చేసుకున్నావు..
నువ్వు పరిచయం అయ్యావు…
తెలుగు సినిమాకు నువ్వు టార్చ్ బేరర్ వి అయ్యావు..
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు..
ఈర్ష్య అసూయలతో రగిలే ఇతర హీరో అభిమానులకు సైతం నిన్ను డార్లింగ్ చేసింది…
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు
సినిమా పరిశ్రమలో ఒక్క నెగిటివ్ కామేంట్ కూడా ఎరుగని మంచి మనసున్న “రాజు”వయ్యావు
నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు
వినయంలో గుణాభి రాముడిని, సమ్మోహనంలో కృష్ణుడిని, పౌరుషంలో అభిమన్యుడిని, కరుణలో బుద్ధుడిని, భలంలో భీముడిని,బుజించడంలో ఘటోత్కచుడుని , స్నేహంలో కర్ణుడిని, యుద్ధంలో అర్జునుడిని నీలో చూస్తున్నాము..అన్ని అంశలు కలబోసిన అధ్భుతానివి..
నువ్వు పడే ప్రతి కష్టానికి నీకు పది రెట్లు ఫలితాన్ని ఇవ్వాలని , వేయి శుభములు నీకు కలగాలని కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

– – భానుప్రసాద్ రాజు
( ప్రభాస్ జన్మదినం సందర్భంగా)

LEAVE A RESPONSE