చంద్రబాబు దీక్ష ఒక ప్రహసనం, ఒక ఫార్స్

– అరలీటరు నీటితో 36 గంటల దీక్షా…? అది నిరాహారమా.. ఆహార దీక్షా..?
– బూతు పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో బాబు ఉద్యమం..!
– బూతులను సమర్థిస్తూ దీక్షలు చేయడం ప్రపంచ వింత.. గాంధేయవాదం అంటూ బూతు పంచాగమా?
– ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను అదే మాట అని, చొక్కా నలగకుండా బయటకు వస్తే మేం క్షమాపణలు చెబుతాం
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1. చంద్రబాబు 36 గంటల దీక్ష ఒక ప్రహసనంగా సాగింది. ఆయన దీక్ష ద్వారా ఏం సందేశం ఇస్తున్నారో కూడా తెలియకుండా.. అక్కడ ఆ పార్టీ నేతల ప్రసంగాలు చూస్తే, ఏం ఆశించి చేశారో వారికే అర్థం కాని పరిస్థితి. ఏదైనా నిరాహార దీక్ష చేస్తే.. దానికి ఒక కారణం, ఆ సమస్యకు ఒక పరిష్కారం ఉండేలా ఫోకస్ గా ఉంటుంది. చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నాడో.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికే తెలియదు. అది మొదలైనప్పుడే.. ఆ దీక్ష గురించి వేరేవాళ్ళను అడగటం టీవీల్లో అంతా చూశాం.
2. 40 ఏళ్ళ రాజకీయ అనుభవజ్ఞుడునని చెప్పుకునే చంద్రబాబు.. దీక్ష పేరుతో పార్టీ ఆఫీసులో కూర్చుని, తన పార్టీ నాయకుల చేత దాడులు చేస్తాం.. నరుకుతాం.. కొడతాం.. రండి చూసుకుందాం అంటూ సవాళ్ళు.. విసిరి రెచ్చగొట్టడం చేశారు. ఇలా మాట్లాడింది ఏదో కార్యకర్తల స్థాయి వ్యక్తులు కాదు.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కేబినెట్ లో సుదీర్ఘకాలం మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఈ మాటలు మాట్లాడారు.
– పైగా చంద్రబాబు మెడలో నూలు దండ వేసుకుని, గాంధేయవాదం తరహాలో సత్యాగ్రహం చేస్తున్నట్లు ఫోజ్ ఇచ్చి.. తీరా ఆయన మాట్లాడింది చూసినా, ఆయన పార్టీ నేతలు మాట్లాడిన మాటలు చూసినా ఏహ్యభావం కలుగుతుంది. ఎంతసేపటికీ వారి ప్రసంగాల్లో.. బూతులు, తొడలు గొట్టడం, సవాళ్ళు విసరడం.. రెచ్చగొట్టడం.. సర్, ఒక గంట వదిలేయండి.. అధికారంలోకి రాగానే వాళ్ళ సంగతి చూస్తాం.. గూండాయిజం, రౌడీయిజం అన్నట్టు వారి దీక్ష సాగింది. నిరాహార దీక్ష చేసే పద్ధతి ఇదా..?
3. 72 ఏళ్ళు పై బడ్డ చంద్రబాబు, పైగా డయాబెటిక్.. 36 గంటల దీక్ష పేరుతో ఓ సింహాసనం మీద ఒక బాబా మాదిరిగా కూర్చోవటం.. పాద నమస్కారాలు చేస్తుండటం. ఈనాడు పత్రికలో చూస్తే.. అర లీటరు నీళ్ళు తాగితే దీక్ష చేశారని రాయడం…. ఈరోజు ముగింపు దీక్ష సందర్భంగా.. గంటకు పైగా ఆవేశంగా, ఊగిపోతూ ఎలా మాట్లాడగలిగాడు..? ఇంతకంటే ఫార్స్ దీక్ష ఏమైనా ఉంటుందా.. అది నిరాహారమా.. ఆహార దీక్షా..?
– పక్కనే ఉన్న 35 ఏళ్ళ తన కొడుకు దీక్షకు కూర్చోవచ్చుగా.. ఎందుకు కూర్చోలేదు. అసలు దీక్షలో చందాలు ఇవ్వడమేంటి.. నోట్ల కట్టలు ఇవ్వడం ఏంటి.. ఎక్కడైనా చూశామా.. అదేమైనా ప్లీనరీనా.. ఎక్కడా జరగదు, ఇవన్నీ చూస్తే.. మనం ఏ ప్రపంచంలో ఉన్నామో తెలియడం లేదు.
4. చంద్రబాబు 36 గంటల దీక్షను గమనిస్తే.. సంఘ వ్యతిరేక శక్తులు, వ్యక్తులు, చీకటి వ్యక్తులు, మాఫియా మూకలు ఒక దగ్గర చేరి, వ్యూహం పన్నినట్లు అనిపించింది. ప్రజలకు సంబంధించిన చర్చ ఏదీ జరగలేదు. వారి బాధ ఏంటో దాని మీద కూడా ఫోకస్ లేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ ఆఫీసుపై దాడికి వచ్చారు అంటే, దానికి గల కారణమైన మాటల గురించి అసలు ప్రస్తావనే లేదు.
– మొదలు పెట్టడమే.. మేం అడుగేస్తే.. నరికేస్తాం.. రండి తేల్చుకుందాం.. అని రెచ్చగొట్టే మాటలు, సవాళ్ళు విసరడం… చేశారు.
– అంతకుముందు ఇదే చంద్రబాబు, ఏ ఫలితం ఆశించి చేశారో, అది సరిపోలేదని, మళ్ళీ దీక్ష పేరుతో, అవే బూతులను తిప్పి తిప్పి మాట్లాడింటి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
– ఏ రికాక్షన్ మీద అయితే తాను దీక్ష చేస్తున్నానంటున్నాడో.. దాని గురించి ఒక్క మాట అనకుండా, ఇక్కడేవో ఘోరాలు జరిగిపోతున్నాయని చంద్రబాబు మాట్లాడాడు.
5. ఒక బూతును సమర్థించుకుంటూ, దాని మీద ఒక ఉద్యమం నడపటానికి శ్రీకారం చుడుతూ.. ఇక్కడ చేసిన రచ్చ చాలలేదని, దానిని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళడం… బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇది తొలిసారి. ఎవరూ ఇలాంటి ఆలోచన కూడా చేయరు. ఈ దిక్కు మాలిన ఆలోచనలు బాబుకు మాత్రమే వస్తాయి. ఇటువంటి దీక్షలు చంద్రబాబు మాత్రమే చేస్తారు.
– బండ బూతులు తిట్టి.. ఆ బూతులు గురించి ప్రస్తావన చేయకుండా, దాని గురించి ప్రశ్నించినందుకు.. అది మా హక్కు, మా హక్కును హరిస్తారా.. అన్నట్టు బూతు పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తారట.
6. పట్టాభి ఏమన్నాడో.. ఆ మాటే ఇంతవరకు వినలేదు అని చంద్రబాబు మాట్లాడటం చూస్తే.. ఇది బాధ్యతారాహిత్యం కాదా.. పట్టాభీతో ఆ మాటలు అనిపించిందే చంద్రబాబు. పట్టాభి మాట్లాడిన బోషిడీకే మాట వినలేదని బాబు అంటున్నాడంటే.. అసలు ప్రజలు వెర్రివాళ్ళు, అమాయకులు అనుకుంటున్నాడా..? ఇంత నిస్సిగ్గుగా మాట్లాడటానికి బాబు అసలు మనిషేనా..?
– నిజంగా ఆ మాట వినకపోయినా, పరుషపదం కాకపోయినా.. ఎందుకు దాన్ని రాయడానికి ఈనాడు సందేహించింది. ఎందుకు వాళ్ళ నాయకులు నిన్నటి నుంచీ ఇన్ని అర్థాలు లాగుతున్నారు. ఆ మాటకు అర్థాలు ఒక్కొక్కరూ ఒక్కోరకంగా మాట్లాడుతున్నారు. “బాగున్నారా అని.. అమాయకులు అని, గుజరాత్ లో ఒక ఊరు ఉందని” వాళ్ళే విపరీత అర్థాలు తీస్తున్నారు. అది పచ్చి బూతు పదం అని, దానిని తెలిసే బూతులా ఉపయోగించాడని రాష్ట్ర ప్రజలకు తెలుసు. అది ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే.. భవిష్యత్తులో ఏ పరిస్థితికి దారితీస్తుందో.. రాజకీయాలు అంటే భయపడే పరిస్థితి ఉంటుందని, ఇబ్బంది అయినా బయటకు చెప్పారు.
– మీరు కూడా ఆ మాటకు అర్థం ఏమిటో గూగుల్ లో చూడండి అని మీడియా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం.
7. ఒక బూతు మాట కోసం.. ఇంత జరిగితే.. దానిని వదిలేసి చంద్రబాబు అమరావతి గురించి, మరోదాని గురించి మాట్లాడాడు. అసలు అమరావతికి దీనికి సంబంధం ఏంటి..? బూతులు తిడితే.. కోపం ఎందుకు వచ్చిందని అంటే ఏం చెబుతాం. మనం సభ్యసమాజంలో ఉన్నామా.. లేక అనాగరిక ప్రపంచంలోకి వెళుతున్నామా..?
– రాక్షస గుణాలు.. మాఫియా శక్తుల్లా వ్యవహరించడం.. బూతులు తిట్టడం, బెదర గొట్టడం..దౌర్జన్యం చేయడం రౌడీలు చేసే పని.
8. సమాజంలో ఉన్న అన్నివర్గాల ప్రజలు చంద్రబాబు చేసింది తప్పు అని నిలదీయాలి. ఇలా వదిలేస్తే.. అసలు సమస్యను పక్కదారి పట్టించి.. దీనిని జాతీయ సమస్య చేయాలనుకుంటున్నాడు.
– రేపోమాపో ఢిల్లీ వెళుతున్నాడు కదా.. బోషిడీకే అన్న పదానికి అర్థం బాగున్నారా.. అని అంటున్నారుగా.. అయితే అమిత్ షా ను కలిసినప్పుడు ఆయన్ను బోషిడీకే అని, చొక్కా నలగకుండా బయటకు రాగలిగితే మేమే క్షమాపణలు చెబుతాం.
– ఈనాడు వారికి కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ పద ప్రయోగం చంద్రబాబు ఢిల్లీలో చేస్తే.. వచ్చే రియాక్షన్ చూడండి. ఎవరూ ఏమనకపోతే.. మేం చెంపలేసుకుని ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెబుతాం. దానికి సిద్ధమేనా..?
9. ఇక గంజాయి గురించి వాస్తవాలను పరిశీలిస్తే.. ఏపీలో నమోదైన గంజాయి కేసులు 7689 ఉంటే.. మేం అధికారంలోకి వచ్చిన ఏడాది 2020లో 1583 కేసులు, 2021లో 1456 కేసులు నమోదు అయ్యాయి. అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చూస్తే..
2015లో 683
2016లో 899
2017లో 1200
2018లో 871
2019లో 997 కేసులు నమోదయ్యాయి. మా హయాంలో మూడు వేల కేసులు నమోదైతే.. మిగతా నాలుగు వేల కేసులు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బుక్ అయినవే కదా.. మీ పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర నాయకులు ఎంతమంది గంజాయి కేసుల్లో లేరు.
– ఒక్క సంవత్సరంలోనే 2.93 లక్షల కేజీలు గంజాయి, అంటే 1500కు పైగా లోడులు మా ప్రభుత్వ హయాంలో పోలీసులు పట్టుకున్నారు. గంజాయి సాగు, రవాణాపై ఎస్ఈబీ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం వల్లే దాదాపు 3 లక్షల కేజీల గంజాయిని ధ్వంసం చేశాం.. మీ మాదిరిగా వదిలేస్తే సరిపోయేది కదా.. అదీగాక, గంజాయి నియంత్రణకు దేశం అంతా సీరియస్ గా తీసుకుని అంతర్రాష్ట్రాలు సహకరించుకుని ముందుకు వెళుతున్నాయి.
10. చంద్రబాబు మోకాలికి, బోడి గుండుకు ముడి పెడుతూ.. ఎక్కడో హెరాయిన్ దొరికితే ఏపీకి దానిని తెచ్చి ఏపీకి చుడుతున్నారు. అవే అబద్ధాలు పది మార్లు చెప్పి.. తన పార్టీ నాయకుల చేత నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడించి, గంజాయి, హెరాయిన్, ఏకంగా ముఖ్యమంత్రి జగన్ గారే ఆ బిజినెస్ చేశారని ఆరోపణలు చేసే సందర్భంలో, ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆ బూతు మాట కూడా మాట్లాడారు.
– చంద్రబాబు అంటే ఓ పెద్ద అబద్ధం.. ఆయన చెబుతున్నవాటిలో అబద్ధాలు తప్పితే.. ఏమీ ఉండవు. కుట్రపూరితంగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని, ఏకంగా ముఖ్యమంత్రి గారి గురించి బూతు మాటలు మాట్లాడించి, దానిమీద ఆవేశాలు వ్యక్తమైతే, దాన్ని ఆసరా చేసుకుని, ఇప్పుడు చొక్కా చించుకుని… ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని మీ దగ్గరకు రాబోతున్నారని కేంద్రంలోని ఢిల్లీ పెద్దలకు మేం కూడా వివరిస్తాం. ఇటువంటి వారి పట్ల అందరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి అని చెబుతాం. మిగతా రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి కల్చర్ భవిష్యత్తులో ఉండాలా.. దిగజారి మాట్లాడే బూతు మాటలు ఉండాలా.. లేక సంసార పక్షంగా ఉండాలా అన్నది అంతా తేల్చుకోవాలి.
– బూతులు తిట్టించడం మాకు పెద్ద పని కాదు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది కాబ్టటి, ఎక్కడికక్కడ టీడీపీ నేతలను నిలదీయాలి, ఆ పార్టీ అధ్యక్షుడికి తద్వారా బుద్ధి చెప్పాలి అని కోరుతున్నాం.
11. ఇటువంటి నేతలకు ప్రజలే గడ్డిపెడతారు, బుద్ధి చెబుతారు. రాజకీయాల్లో విలువలు ఉండాలని ఆకాంక్షిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేస్తుంది. పైకి ఉదాత్తమైన పోరాటం చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చే తెలుగుదేశం పార్టీ బండారాన్ని బయటపెట్టి, వారి బట్టలుప్పదీసి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలనే ఈ ప్రెస్ మీట్..