Suryaa.co.in

Entertainment

ఈ బాధురి..నటమయూరి!

ఆమె..
హేమామాలినిలా కలల రాకుమారి కాదు..
రేఖలా కుర్రకారుని
ఊపేసే మత్తు లేదు..
ఆశాపరేఖ్ వోలె
పెద్ద కళ్ళు కావు..
ముంతాజ్ మల్లె
హమారే సివా తుమారే
ఔర్ కిత్నే దివానే హై
అనిపించుకోలేదు..
ఇంకా ముందుకు వెళ్తే..
వైజయంతిమాల సొగసు..
నర్గీస్ సోయగం..
సిమి పరువం..
ఇవేమీ లేని ఓ గౌరవం..
గుడ్డి..ఈ పంచదార బుడ్డి..!

జయబాధురి..
అభినయమే ఆమె అందం..
హుందాతనమే
తన సౌందర్యం…
గుడ్డిలో గౌను..
అప్పుడే కోట్లాది మంది
ఆమెకు ఫ్యాను..
అదే చిన్నారి ఖోషిష్ లో
మహానటుడు సంజీవ్ తో
పోటాపోటీగా నటిస్తే
నివ్వెరపోయింది బాలీవుడ్డు..
ఆరడుగుల అమితాబే
అయిపోయాడు
బాయ్ ఫ్రెండు..
ఆ తర్వాత ఆ మొనగాడే ఆమెకి మగడు..
ఆ సాధ్వి నుదుటిన
అలజడి రేఖ..
అబ్బో..అదో పెద్ద సిల్ సిలే..!
సంసార జీవితంలో షోలే
అయినా పోనీలే
అనుకుని అభిమాన్ నిండిన
ఈ బాధురి బచ్చన్
చుప్కే చుప్కే..
ఒడిదుడుకుల కాపురమైనా
ఆ కొరాకాగజ్ మన్
లిఖ్లియా నామ్ ఇస్ పే
అమితాబ్ బచ్చన్..
మంచితనమే ఆమె జయం..
నెమ్మదితనమే
ఈ బాధురి బహదూరి!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
*9948546286*

LEAVE A RESPONSE