ఈ మరణాలకు ముఖ్యమంత్రి నైతిక భాద్యత వహించాలి

– ఆంధ్రప్రదేశ్ భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విధిస్తున్న కరెంటు కోతల వల్ల జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ముగ్గురు పసిపిల్లలు మరణించడం చాలా బాధాకరం. ఇంకో 30 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారన్న వార్తలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. కరెంటు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యపు విధానాల పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ మరణాలు వైసీపీ ప్రభుత్వం చేసిన హత్యలుగానే బిజెపి భావిస్తోంది. చనిపోయిన పిల్లల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, మిగిలిన పిల్లలకు ఎలాంటి అపాయం కలగకుండా, రాష్ట్రంలో ఇలాంటి మరో సంఘటన జరగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

Leave a Reply