Suryaa.co.in

Entertainment

విజయ్ కాంత్ మృతి బాధాకరం

-సినీ పరిశ్రమలో ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయాను
– టీడీపీ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ

తమిళ సినీ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి బాధాకరం. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్ కాంత్ అకాల మరణం ఒక్క కోలివుడ్ కే కాదు యావత్ భారతీయ సినీ పరిశ్రమకు తీరనిలోటు. ఇనిక్కుం ఇలామై సినిమాతో కెరీర్ ప్రారంభించిన విజయ్ కాంత్ 100కు పైగా చిత్రాల్లో హీరోగా నటించి అభిమానులను అలరించారు. ఒక్క తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేశారు. మిత్రుడు విజయ్ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను

LEAVE A RESPONSE