Suryaa.co.in

Andhra Pradesh Entertainment

అవార్డుల వర్షం కురిపించిన స్ఫూర్తితో తెలుగు సినిమా పని చేయాలి

– తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు, అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటునిగా వచ్చిన అవార్డుపై నందమూరి బాలకృష్ణ స్పందన

తెలుగు చలన చిత్ర చరిత్రలో మొట్ట మొదటి సారిగా సోదరుడు అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటునిగా అవార్డు దక్కడం నటునిగా ఎంతో గర్వపడుతున్నానని నందమూరి బాలకృష్ణ అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ మరియు ఆంకాలజీ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా రెండు రోజుల పాటూ అడ్వాన్స్డ్ ఆంకాలజీ నర్సింగ్ సింపోజియం ప్రారంభించిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ తెలుగు సినిమా సత్తా దేశ విదేశాలలో చాటామని, విదేశీయులు కూడా తెలుగు సినిమా చూసే స్థాయికి మన చలన చిత్ర పరిశ్రమ చేరుకోవడం సంతోషకరమైన అంశమన్నారు. పుష్పతో పాటూ ఆర్ ఆర్ ఆర్, ఉప్పెన సినిమాలకు కూడా పలు అవార్ఢులు దక్కడం తెలుగు వారికే గర్వకారణమని చెప్పారు. ఇలా అవార్డుల వర్షం కురిపించిన సూర్తితో తెలుగు సినిమా పని చేయాలని సూచించారు.

LEAVE A RESPONSE