Home » ఎన్టీఆర్‌.. బాబుకు ఎందుకు మద్దతునివ్వలేదు?

ఎన్టీఆర్‌.. బాబుకు ఎందుకు మద్దతునివ్వలేదు?

చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే వైఎస్ జగన్ ఏమన్నా ఉరితీస్తాడా?
పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకుగా ముందడుగు వేసి మద్దతు ఇచ్చారు
సినీ పరిశ్రమ పెద్దలు దొంగ ముసుగులు వేసుకోవద్దు
చంద్రబాబులాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదు, ప్రజల్లో ఉండాలి
చంద్రబాబు ఏనాడు వైఎస్ ను కక్షపూరితంగా చూడలేదు
చంద్రబాబు అంటే సినీ పరిశ్రమ – సినీ పరిశ్రమ అంటే చంద్రబాబు
వైఎస్ జగన్ ప్రజలకు ప్రమాదం
సినీ నిర్మాత నట్టికుమార్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆయన మేనల్లుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ మౌనంగా ఉంటున్న వైనంపై.. ఇప్పటివరకూ టీడీపీ అభిమానులు, కమ్మ సామాజికవర్గమే ఆగ్రహంతో రగిలిపోతోంది. తాజాగా సినీ నిర్మాత నట్టికుమార్‌ సైతం ఆ జాబితాలో చేరిపోయారు.

బాబు అరెస్టుపై ఎన్టీఆర్‌పై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆయనకు ఎందుకు మద్దతునివ్వడం లేదని నట్టి కుమార్‌ కడిగేశారు. ఆ మాటొకొస్తే జూనియర్‌ ఒక్కరినే కాదు.. సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసిన బాబు అరెస్టయితే స్పందించకుండా మౌనంగా సినీ పరిశ్రమ ప్రముఖులందరినీ ఉతికి ఆరేశారు. ఇన్ని మాటలన్న నట్టికుమార్‌.. తాను రాజకీయంగా బాబుకు దూరం. వ్యక్తిగతంగా దగ్గర అని చెప్పారు. ఇప్పుడు నట్టికుమార్‌ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇంతకూ నట్టికుమార్‌ ఏమన్నారంటే..
చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించకపోవడం దారుణం. జూనియర్ ఎన్టీఆర్ సహా ఇతరులెవరూ మద్దతు ఇవ్వకపోడం బాధ కలిగించింది. సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తి చంద్రబాబునాయుడు. ఓ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడుగా అండగా ఉండటం మానవత్వం.

సినీ పరిశ్రమ కోసం ఎంతో చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు.చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే వైఎస్ జగన్ ఏమన్నా ఉరితీస్తాడా? చంద్రబాబు చేసిన సేవలను గౌరవించి ఆయనకు అండగా నిలబడాలి.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లోని నందమూరి అభిమానులు ఎందుకు స్పందించడం లేదు? చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్ లాంటి వ్యక్తులు మద్దతుగా ట్వీట్ చేస్తే చాలు. వెనుకాల నుంచి సపోర్ట్ చేసేవాళ్లు దొంగలు, ముందుండి మద్దతు ఇచ్చిన హీరో పవన్ కళ్యాణ్.సినీ పరిశ్రమ పెద్దలు దొంగ ముసుగులు వేసుకోవద్దు. పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకుగా ముందడుగు వేసి మద్దతు ఇచ్చారు.

నేను తెదేపాకు దూరం, చంద్రబాబు వ్యక్తితత్వానికి దగ్గర. చంద్రబాబులాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదు, ప్రజల్లో ఉండాలి. వైఎస్ జగన్ ప్రజలకు ప్రమాదం. దేశంలో ఉన్న కేసుల్లో ఎక్కువగా రాజకీయ నాయకులపైనే ఉన్నాయి.

చంద్రబాబు అంటే సినీ పరిశ్రమ – సినీ పరిశ్రమ అంటే చంద్రబాబు. చంద్రబాబు భోళా శంకరుడు. చంద్రబాబు ఏ రోజు కక్షసాధింపులు చేయలేదు. చంద్రబాబు ఏనాడు వైఎస్ ను కక్షపూరితంగా చూడలేదు.

Leave a Reply