Suryaa.co.in

Entertainment National

అదానీని రక్షించేందుకే ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు:నారాయణ

ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు నుంచి అదానీని రక్షించి, ఆ వ్యవహారం నుండి దృష్టి మళ్లించేందుకే ఆర్యన్ అరెస్ట్ చేశారని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. హైదరాబాద్ మగ్దూం భవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎం.పి సయ్యద్ అజీజ్ పాషాలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. సినీ హిరో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ చేసి, చిత్ర హింసలకు పెడుతున్నారన్నారు.
ఆ కుటుంబం అంతా బిజెపి వ్యతిరేకమని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా గుజరాత్ ముంద్రా పోర్టుకు డ్రగ్స్ వచ్చిందన్నారు. ముంద్రాపోర్టు ప్రధాన మంత్రి దత్తపుత్రుడు ఆదానీదని అన్నారు. ఆ పోర్టులో ఎం జరిగినా పట్టుకోవడానికి వీల్లేదన్నారు. అదానీ కుటుంబానికి రోజుకు వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని, సక్రమంగా సంపందిస్తే వెయ్యి కోట్లు వస్తాయా అని ప్రశ్నించారు. హెరాయిన్ ద్వారానే రోజుకు వెయ్యి కోట్లు వస్తాయని చెప్పారు.
ముంద్రా పోర్డుకు వచ్చిన డ్రగ్స్ తాలూకు కార్యాలయం అడ్రస్ విజయవాడలో ఉన్నదని , అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఉందన్నారు. వైసిపి ప్రభుత్వం అమిత్ కనుసన్నల్లో నడస్తుందన్నారు. విజయవాడలో హెడ్ ఆఫీస్ పెట్టుకున్నారని, అక్కడి నుంచి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు హెరాయిన్ సరఫరా చేస్తున్నారని విమర్శించారు. హెరాయిన్ దొరికిన తరువాత ఆదానీ ప్రపంచమంతా ముద్దయిగా మారుమొగుతున్న సమయంలో ఆర్యన్ పట్టుకున్నారని తెలిపారు. హీరో కొడుకు గనుక దీన్ని అడ్డం పెట్టుకొని, ఆదానీ వ్యవహారాన్ని మరుగుపర్చుతున్నారని అన్నారు.
పెగాసెస్ సుప్రీం కోర్టు కమిటీ వేయడం ప్రజాస్వామ్య విజయం
పెగాసెస్ సుప్రీం కోర్టు ప్రత్యేకంగా జస్టిస్ రవీంద్రన్ నాయకత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయడం ప్రజాస్వామిక విజయమని నారాయణ పేర్కొన్నారు. పెగాసెస్ ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానం గూఢచార వ్యవస్థను నడిపిందన్నారు. ఈ సంస్థ భారతదేశానికి, ప్రపంచానికి, మానవ జాతికి వ్యతిరేకమైందన్నారు. భారతదేశంలో జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులు, అందరిపైనా నిఘా పెట్టారని, పార్లమెంట్ ఒక్క రోజు అంటే ఒక్కరోజు సజావుగా జరగలేదన్నారు. పెగాసెస్ నిఘా సంస్థను ప్రశ్నించే వారిపై ప్రయోగించారన్నారు.
వ్యక్తిగత భద్రత, ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత భద్రత ఉందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును భంగం కలిగించారన్నారు. కాబట్టి దీనిపై చర్చ జరగాలని, కేంద్రం సమాధానం ఇఆ్వలని సుప్రీం కోర్టు మూడు సార్లు అడిగిందన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చివరకు జస్టిస్ రవీంద్రన్ నాయకత్వంలో ముగ్గురు టెక్నికల్ కమిటీ నియమించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలన సాగుతోందన్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇళ్లపై, పార్టీ కార్యాలయాలపై దాడులు జరపడాన్ని ఆయన ఖండించారు.
కేంద్రం, రాష్ట్రం కుమ్మకై రైతు చట్టాలు అమలు చేస్తున్నాయి : చాడ వెంకట్ రెడ్డి
నూతన సాగు చట్టాలపై స్టే ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అమలుకు చర్యలు తీసుకుంటున్నాయని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మొదట ఎఫ్ ధాన్యం కొనుగోలు చేయబోమని చెబితే తాము కూడా కొనుగోలు చేయబోమని సిఎం కెసిఆర్ అన్నారని, తరువాత ఎఫ్ కొంటామంటే కొన్నారని తెలిపారు. చాపకింద నీరులా కొత్త చట్టాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయం రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించి వేస్తుందని విమర్శించారు.
రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రం బలంగా ఉంటుందన్నారు. కొత్త చట్టాలు తీసుకువచ్చి భవిష్యత్ రైతు అన్న పదం ఉండకుండా కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. దీనికి వ్యతిరేకంగా రైతులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు కంపుకొడుతున్నాయని, రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గుండాలు, రౌడీలు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. హుజూరాబాద్ రాజకీయాలు చూస్తుంటే, సంక్షేమ పథకాలు ఇస్తూనే, డబ్బులు, మద్యం, గంజాయి ఇస్తున్నారని అన్నారు.

LEAVE A RESPONSE