Suryaa.co.in

Entertainment

హెలెన్.. హిందీ సినిమాకి సెలైన్..!

ఆమె ఆడితే
థియేటర్లు గెంతాయి..
పెదవి కదిపితే
పృధివి ఊగింది..
జ్యోతిలక్ష్మి..జయమాలిని..
ఇలాంటి నర్తకీమణులకు
బాలీవుడ్ అక్క..
హిందీ హీరోలను
ఆడించింది చెమ్మచెక్క..!

హెలెన్ అంటేనే
కదిలే బాంబు..
ఆమె ఉంటేనే
బాలీవుడ్ బొమ్మకి
ఎక్కడలేని డాబు..
శరీర కదలికలతో
ఏలేసింది హిందీ సినిమాని
ఊపేసింది తాతతండ్రుల
జమానాని..!

మోనికా ఓ మై డార్లింగ్..
హెలెన్ పాటే కార్వాన్ హిట్టు
మెహబూబా..మెహబూబా..
అంజాద్ ఎదురుగా
ఆడుతున్న మగువ..
వేగుతున్న మాంసం..
ఏది ముందాని
అంతటి గబ్బరూ మీమాంసం!
అసలు హెలెన్ పాట కోసమే
సినిమాకి వెళ్ళిన ప్రేక్షకుడు
ఆమె ఆడుతుంటే
మైమరచిపోయిన
పిచ్చి వీక్షకుడు..!!

తొలినాళ్ళలో హెలెన్ ఆట..
గీతాదత్ పాట ఊపేస్తే..
పిదప అందుకుంది
ఆశా భోస్లే..
అక్కడి నుంచి
ఆ స్వరం..ఈ లయం..
బాలీవుడ్ విలయం..!

తెలుగు సినిమాలోనూ
హెలెన్ విరిచింది విరుపు..
విన్నావా చిన్నవాడా అంటూ
దొంగల్లో దొర అక్కినేనికి
విసిరింది వలపు వల..
సుందరాంగా అందుకోరా
ఇలా భూకైలాస్
రావణబ్రహ్మ రామారావును
మురిపించబోయిన అప్సరస..
ఒలికించింది మేనితోనే నవరస..కుదరని వరస!
ఇక ఎక్కేసింది హౌరా బ్రిడ్జి
మేరా నామ్ చిన్ చిన్..
వెనక్కి చూడని హెలెన్..
ఏడు వందల యాభై
సినిమాల్లో మెరిసెన్..!

సురేష్ కుమార్ ఇ
9948546286

LEAVE A RESPONSE