– టీడీపీ హయాంలో వీరికి కమీషన్ల బేరం కుదరకే పంపించేశారు
–2018లోనే ప్రహరీ గోడ పనులు మొదలుపెట్టి.. ఎందుకు ఆపేశారో వాళ్ళే చెప్పాలి
– జాకీ సంస్థకు భూములు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది..
– అయినా వారే ముందుకు రావడం లేదు
– ఏపీలోనే కాదు, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ జాకీ ఎందుకు ఉత్పత్తులు ప్రారంభించలేదు..?:
– చంద్రబాబును జాకీలు పెట్టి లేపడానికే ఈనాడు రామోజీ “జాకీ రాతలు”
– బాబు తెస్తానన్న రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎవరు ఎత్తుకెళ్ళారు..?
-రామోజీకి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబును ప్రశ్నించాలి
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి
లోకేష్, పరిటాలకు కమీషన్ల బేరం కుదరకే పంపించేశారు
పాడిందే పాటరా.. అన్నట్టు పాత వార్తలను ఈనాడు రామోజీరావు వండివారుస్తున్నాడు. ఆ పచ్చ పత్రికలో రాసుకోవడానికి రాష్ట్ర స్థాయి కథనాలు కరువయ్యినట్లున్నాయి. “నేతలను మేపలేక జాకీ పరార్” అంటూ ఈనాడు ఇవాళ పతాక శీర్షికలో రాశారు. ఆ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోడానికి కారణం టీడీపీ హయాంలో ఉన్న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి లోకేష్, అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీతలే. టీడీపీ ప్రభుత్వానికి కమీషన్ల బేరం కుదరకే జాకీ ఫ్యాక్టరీ తరలిపోయింది అన్నది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ జాకీ సంస్థను ఏపీలో ఉత్పత్తి ప్రారంభించమని కోరుతూనే ఉంది. జాకీ పరిశ్రమకు అవసరమైన భూములను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా వాళ్లే ముందుకు రావడం లేదు. జాకీ ఎందుకు వెళ్ళిందో అప్పటి పప్పు, తుప్పు మంత్రులే చెప్పాలి.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న నారా లోకేష్.. అవన్నీ ఎక్కడకు వెళ్లాయో సమాధానం చెప్పాలి. అసలు ఆ సంస్థలు పెట్టారా..పెడితే..ఎక్కడకు వెళ్లాయి..? లేదంటే వాటన్నిటీ లోకేష్ తినేశాడా అనే అనుమానం ఉంది. ఆ సంస్థలు రానందుకు లోకేష్, చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. ఇలాంటి మోసపు మాటలు చెప్పినందుకే ప్రజలు 2019 ఎన్నికల్లో తగిన శాస్తి చేశారు. జాకీ పేరుతో పేజ్ అనే సంస్థకు అప్పటి ప్రభుత్వం 2017లో భూములు కేటాయించి 2018లో సేల్ డీడ్ ఇచ్చింది. మరి ఆ సంస్థ ఎందుకు రాలేదో వారే చెప్పాలి.
అప్పట్లో పరిశ్రమల మంత్రిగా ఉన్న లోకేష్ అనే పప్పు మంత్రి, ఇక్కడున్న తుప్పు మంత్రి, ఆమె కుమారుడు ఆ పరిశ్రమ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలి. ప్రహరీ గోడ కాంట్రాక్టు కోసం స్థానిక మంత్రి కుమారుడు, తమ్ముడు ఇద్దరూ అప్పుడు పోటీ పడ్డారు. 2018 జూన్‌లో ప్రహరీ గోడ నిర్మాణం కూడా ప్రారంభించారు. అలా ప్రారంభించిన పనులను ఎందుకు ఆపేశారో వాళ్లే చెప్పాలి. ఆరోజు ఉంది టీడీపీ ప్రభుత్వమే కదా.. ఎవరు ఆ సంస్థ రాకుండా అడ్డుకున్నారో చెప్పాలి. ఎవరు తరిమేశారో పప్పు మంత్రి, తుప్పు మంత్రి సమాధానం చెప్పాలి. 140 కోట్ల రూపాయల విలువైన భూములను 240 కోట్లకు ఆ సంస్థకు ఎలా రాసిచ్చారో కూడా వాళ్లే సమాధానం చెప్పాలి. ఎక్కడ జాకీ… ఎవ్వరి జాకీ… ఎవ్వరు వెళ్లగొట్టారు…?.
మరి, ఆ రాష్ట్రాల్లో జాకీ ఎందుకు ఉత్పత్తులు ప్రారంభించలేదు..?:
ఇప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ పేజ్ సంస్థను రమ్మనే కోరుతోంది. పలుచోట్ల భూములను కూడా చూపిస్తూనే ఉన్నాం. కానీ వాళ్లే రావడం లేదు. టీడీపీ, ఈనాడు ఆరోపించినట్లు ఒక్క తెలంగాణాలోనే కాదు.. సదరు సంస్థ భువనేశ్వర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో కూడా భూములు తీసుకుంటోంది. మరి అక్కడ ఆ సంస్థ ఉత్పత్తి ప్రారంభించిందా లేదా అనేది ఈనాడు రామోజీరావు కనీసం సమాచారం సేకరించి రాయాల్సింది. వాళ్ల ఆదాయానికి అనుకూలంగా ఉంటే కొనసాగడం, లేదంటే చాపచుట్టేసి వెళ్లిపోవడం సదరు సంస్థకు రివాజుగా మారింది. తిరుపూర్, బెంగుళూరు ప్రాంతాల్లో కూడా జాకీ సంస్థ రెండు యూనిట్లు మూసివేసిన విషయంపై కూడా వీళ్లే సమాధానం చెప్పాలి.
మీకు చేతకానివి..చేయలేనివి మాపై రుద్దుతారా..?
టీడీపీ ప్రభుత్వ హాయంలో చేతకాక, చేయలేని పనులన్నీ ఈ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో కూడా లక్షల కోట్ల విలువైన భూములను సేకరించి భవనాలు నిర్మిస్తామని చెప్పి, గ్రాఫిక్స్ చూపించి రైతులను, ప్రజలను మోసం చేశారు. ఇలాంటి ఆబద్దాలు చెప్పినందుకే ప్రజలు టీడీపీని తరిమితరిమి కొట్టారు.
బాబు తెస్తానన్న రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎవరు ఎత్తుకెళ్ళారు:
ఈనాడు పత్రికకు ఒకప్పుడు కాస్త క్రెడిబులిటీ ఉండేది. కానీ ఇప్పుడు, నిత్యం తప్పుడు వార్తలు, చంద్రబాబు అనుకూల భజనతో అదొక పచ్చ పత్రికగా, కేవలం జగన్ మోహన్ రెడ్డి మీద విషం చిమ్మటానికే పుట్టినట్టు దుష్ప్రచారం చేస్తుంది. చంద్రబాబు అవినీతి సామ్రాజ్యాన్ని రామోజీరావు జాకీలు పెట్టి లేపాలనుకుంటూ, నిత్యం తప్పుడు వార్తలు వండివారుసున్నాడు. రామోజీ రావుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే… టీడీపీ హయాంలో తెస్తామన్న రూ. 20లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు ఎక్కడకు వెళ్లాయని, ఎవరు ఎత్తుకు వెళ్ళారని చంద్రబాబును ప్రశ్నించాలి. వాస్తవాలు బయటకు తీసుకురావాలి గానీ, ఎంతసేపటికీ జగన్ మోహన్ రెడ్డిప్రభుత్వంపై బురదచల్లితే ప్రజలు నమ్మరు అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.