పవన్ కు చంద్రబాబు, నారా లోకేశ్, పలువురు సినీ స్టార్ల శుభాకాంక్షలు

పవన్ జన్మదినం సందర్భంగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

మీకు ఆయురారోగ్యాలు, ఆనంద ఐశ్వర్యాలు అనుగ్రహించాలని కోరుకుంటున్నానన్న చంద్రబాబు

పవర్ నే ఇంటి పేరుగా మార్చుకున్నారన్న రవితేజ

జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ప్రముఖ సినీ నటులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.

భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనంద ఐశ్వర్యాలను అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నారని చెప్పారు.

‘జనసేన’ అధ్యక్షుడు, సోదరుడు పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్లు ఇవే:

ఈ విశ్వంలో సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. పవన్ ఈశ్వరుడు ఒక్కడే. మా దేవరకు జన్మదిన శుభాకాంక్షలు – బండ్ల గణేశ్

నా గురువు, ధైర్యం పవన్ మామకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ప్రతి రంగంలోనూ మీరు విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా – సాయి ధరమ్ తేజ్

మంచితనానికి మారుపేరు, మంచి మనసుకు నిర్వచనం అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం… ఇవన్నీ కలబోస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు – పరుచూరి గోపాలకృష్ణ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సార్ కి జన్మదిన శుభాకాంక్షలు.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా సార్ – నితిన్

పవన్ కల్యాణ్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో మీరు అనుకున్నవన్నీ సాధించాలి – మంచు మనోజ్

పవర్ ను తన ఇంటి పేరుగా మార్చుకున్న స్నేహితుడు పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి – రవితేజ

మంచి మనిషి, జనసేనాని పవన్ కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు – రామ్ పోతినేని

Leave a Reply