Suryaa.co.in

Entertainment

నిజమైన భారతీయుడు యేసుదాసు

– దేశభక్తికి నిలువెత్తు చిరునామా

ఒక రోమన్ క్యాథలిక్ మిషనరీ స్కూల్ లో క్లాసు చెబుతున్న టీచర్ ” ప్రపంచంలో ఒక్క క్రైస్తవులు మాత్రమే స్వర్గానికెళుతారని చెప్పారు. అది విన్న ఒక బాలుడు ఎందుకో ఇబ్బందిగా ఫీలయ్యాడు.కాసేపటికి తరువాత పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి “నానా క్రైస్తవులు మాత్రమే స్వర్గానికి కెళుతారంటకదా?? నాకున్న స్నేహితులందరూ హిందువులే మరి స్వర్గంలో ఎవరితో ఆడుకోవాలని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన ఆ అబ్బాయి తల నిమురుతూ నువ్వూ అన్ని మతాలనూ సమానంగా చూడు…అందరూ నీతో వుంటారన్నాడు.తన తండ్రి మాట తూచా తప్పకుండా పాటించాడా కుర్రాడు. ఒకేజాతి,ఒకే మతం ,ఒకే దేవుడన్న నారాయణగురు భోదనతో ప్రభావితమై ఈనాటికి ఆ సిద్దాంతాలను పాటించడమేగాక ప్రజలకు సైతం పాటలరూపంలో చైతన్యపరుస్తున్నాడు.అతడే కె.జే. యేసుదాసు. అపరగానగంధర్వుడు!

భారతీయ సంగీతప్రపంచంలో ఈయన పేరు తెలియనివారుండరంటే అతియోక్తిలేదు.1940 జనవరి 10 న ఒక పేదకుంటుంబంలో జన్మించారు. నాన అగస్టీన్ జోసఫ్ ,తల్లి ఆలిన్ కుట్టి. అగస్టీన్ మంచి శాస్త్రీయసంగీత విద్వాంసుడు. అందుకే దాసుగారి మొదటి గురువు ఆయనే!! దాసు కంఠస్వరం చాలా గంభీరంగా విలక్షణంగా ఉండేది. ఆయన గొంతువిని అప్పటి గొప్పసంగీత విద్వాంసులైన సెమ్మగుడి శ్రీనివాసన్ గారు.కె.ఆర్ కుమార్ స్వామి వంటి వారు తమ శిష్యునిగా చేసుకున్నారు.

అయితే చెంబై.వైద్ధ్యనాధన్ భాగవతార్ అనే గాయకుడు దాసుగారిని మంచి సంగీతకారుడిగా తీర్చిదిద్దారు. తన శిష్యుని కోసం గురువాయూర్ దేవస్థానకమిటీనే ధిక్కరించారు వైధ్యనాధన్ గారు.అప్పట్లలో కేరళలో ప్రతిగ్రామంలో దాసుగారి కచేరి జరిగిందట.అయితే 1961 నవంబరు 14 ఒక మళయాళ సినిమాకు పాట పాడటం ద్వారా సినీరంగప్రవేశము చేసిన దాసుగారు, ఇంక వెనుకతిరిగిచూడలేదు. తెలుగులో అంతులేని కథ సినిమాలో పాడిన”దేవుడే ఇచ్చాడు..వీధి ఒక్కటి” పాటతో ,తమిళ,తెలుగు సినీ పరిశ్రమలలో ఆయనకు ఎదురులేకుండా పోయింది. బాలు లాంటి సింగరే మూడు సంవత్సరాలు ఇబ్బందిబడ్డారంటే ఆయన ప్రతిభ అర్థం చేసుకోవచ్చు!

1976లో హింధీలో రవీంద్రజైన్ సంగీతసారథ్యంలో వచ్చిన చిత్ చోర్ సినిమా లో దాసుగారు పాడిన”గొరితెరా గావ్ బడా ప్యారా., మైతోగయా మారా ఆకే యహారే..”పాట భారత్ అంతా మారుమ్రోగింది..దీనితో హిందీగాయకులందరూ సంఘటితమై.. ఆయనచేత పాట పాడిస్తే మేము పాడమనే
yesudas స్తాయికి వచ్చారు. రవీంద్రజైన్ గారు పుట్టుకతోనే అంధుడు. ఆయన ఏమనేవాడంటే.. దేవుడు ఒకసారి నాకు కనుచూపు ప్రసాదిస్తే యేసుదాసు రూపం చూసి తరిస్తాను” ఇది చాలు దాసుగారి గొప్పతనం చెప్పడానికి!

క్రైస్తవుడివై వుండి పరదేవుళ్ళను స్థుతిస్తూ పాటలు పాడినందుకు ఆ మతపెద్దలు ఆయనను వెలివేసినప్పుడు”నేను కళాకారుడును,నాకు అన్ని మతాలు అవసరమని బదులిచ్చాడు!! 1971లో ఇండోపాక్ యుద్దం అప్పుడు వీధి,వీధి తిరిగి సంగీతకచేరిలు చేసి వచ్చిన విరాళాలు ఇందిరాగాంధికి ఇచ్చిన దేశభక్తుడు. మనదేశంలో ఒక్క కాశ్మీరి,అస్సామీ భాషలలలో తప్ప మిగతా అన్ని భాషలలోనూ పాటలు పాడిన ఘనత ఈయనగారిదే! ఇవే కాకుండా మలేసియన్ ,రష్యన్ ,అరబిక్ ,లాటిన్ ,ఇంగ్లీషుభాషలలో సహితం పాటలుపాడి శ్రోతలను అలరించారు.. కొన్ని పాటలు యేసుదాసు కంఠంతోనే వినాలనిపించేంతగా ప్రజలు విశ్వసిస్తారంటే అతిశయోక్తికాదు! ఆయన గొప్పతనం ఏమిటంటే ఆయన పాడిన హరివరాసనం అనే పాట అయ్యప్పస్వామిని నిద్రపుచ్చేపాటగా ట్రావెన్ కోర్ దేవస్థానం తీసుకుంది. అలాగే మేలుకొలుపుపాట ఆయనదే!! ఇప్పటి వరకు 40000 పాటలు పాడారాయన!!
“స్వరాగ గంగా ప్రవాహమే”

– అంకబాబు, సీనియర్ జర్నలిస్టు

LEAVE A RESPONSE