ఆ పాటలు వింటే అనుభవమ్ము వచ్చు!

అయయో..జేబులొ డబ్బులు పోయెనే..
అయయో..జేబులు
ఖాళీ ఆయెనే..
ఈ పాట వింటుంటే
తెరపై మెదిలే
రేలంగి..రమణారెడ్డితో పాటు
పాడిన గాయక ద్వయం
మాధవపెద్ది..పిఠాపురం…
కళ్ళ ముందు ప్రత్యక్షం..
సాహిత్యం..సంగీతం..
అభినయం..
వీటితో పాటు గాత్రం..
ఆ పాట హిట్టుకు మూలమంత్రం!

సత్యం..నాగేశ్వరరావు..
అదేనండి..
మాధవపెద్ది..పిఠాపురం
జంట స్వరాలు..
పాటల వరాలు..
కామెడీ..పేరడీ..
హిట్టు గీతాల గారడీ..
ఆ ఇద్దరి పాటలు వింటే
కొత్త వారికి
అనుభవమ్ము వచ్చు!

పిఠాపురం ఘంటసాల..
రెండూ ఊళ్లే..
ఆ ఊరికి ఈ ఊరెంతో
ఈ ఊరికి ఆ ఊరంత..
అలా కాక ఇద్దరి ఊళ్లూ
పాటల పండగంట..
ఎవరి ఊళ్ళో ఉందో గాని
పడుచు దెయ్యమంటె
భయమన్నది…
ఆ ఊళ్ళో
మన నాగేశ్వరరావు
నే పాడతాలే పదమన్నాడు..
ఆ పాటతో
మ్యాజిక్ చేసిన అవేకళ్లు..
ఆనందాల పరవళ్ళు…!
చెమ్మచెక్క చెమ్మచెక్క
మల్లెమొగ్గ మల్లెమొగ్గ..
పాటలో స్పీడు..
రెండు గొంతుల లోడు!!

పిఠాపురం గొంతులో
కొడితే గోళీసోడా..
లక్ష్మీనివాసంలో
అదో మధురసం!

పరమగురుడు చెప్పిన వాడు
పెద్ద మనిషి కాడురా..
అదేమో గాని మన పిఠాపురం పాటల మనిషి..
పాట పాడితే చాలు
ఆయన ఖుషీ..
ఆయన టోనే
నవ్వుకు జీవన్ టోన్..
అందుకే ఆయనకు చెప్పేద్దాం
డివ్వీ డీవ్వీ డివ్విట్టం..
నువ్వంటేనే నాకిట్టమని..!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply