కాళి పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిల్మ్ లో కాళికామాత సిగరెట్ తాగుతున్నట్టుగా పోస్టర్ రిలీజ్ చేయటంతో తాజా వివాదం తలెత్తింది.ఈ పోస్టర్‌కు డైరెక్టర్‌ను బాధ్యురాలని చేసి అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డాక్యుమెంటరీకి నిర్మాత, దర్శకురాలు లీనా మణిమెకలై. కాళికామాత ఒక చేతితో సిగరెట్ తాగడం, మరోచేతిలో ఎల్జీబీటీలకు సంబంధించిన జెండాను పట్టుకోవడం రెండూ వివాదం అవుతున్నాయి. హిందూ దేవతను ఇంత దారుణంగా కించపరుస్తారా? అంటూ హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పోస్టర్ పై దర్శకురాలు లీనా వివరణ ఇస్తూ… సమానహక్కుల కోసం ఈ డాక్యుమెంటరీని తీసినట్టు తెలిపారు. వాక్‌స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్దమేనని లీనా అంటున్నారు. కెనడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.
Related Posts
తెలుగు ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం…
ఆగస్టు 1 నుంచి షూటింగుల నిలిపివేతకు సిద్ధమవుతున్న నిర్మాతల మండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ హైదరాబాదులోని తెలుగు…
సూపర్ స్టార్ కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు: జి.కిషన్ రెడ్డి
తెలుగు వెండితెర ‘కౌబాయ్’, సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని కృష్ణ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఐదున్నర…
ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ నన్ను కదిలించింది:కైకాల సత్యనారాయణ
గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ…