Home » లైక్ మైండెడ్..!

లైక్ మైండెడ్..!

ఇక దాగుడుమూతలు వద్దు!
అనధికార సాంగత్యం ఆక్షేపణీయం!
ఇంత బరితెగించి సంబంధాలు కొనసాగిస్తూ ప్రజల్ని మోసం చెయ్యవద్దు!
బ్రిటీష్ ఇండియా..ఇండిపెండెంట్ ఇండియా..!
విప్లవవీరుడు అల్లూరిని అక్రమంగా అన్యాయంగా హతమార్చిన ఆనాటి విశాఖ కలెక్టర్ రూధర్ ఫర్డ్ ని విధుల నుండి తొలగించారు. బ్రిటీష్ వారు సామ్రాజ్యవాదులయినా..మానవహక్కుల పట్ల స్పృహ ఉన్నది.

ఇప్పుడు స్వతంత్ర భారతంలో ఏమి జరుగుతున్నది!?
ఒక పార్లమెంట్ సభ్యుడు..తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ..ఒక స్ఫూర్తి నిచ్చే కార్యక్రమానికి భారత ప్రధాని వస్తుంటే..! ఆయనకు ప్రవేశ అర్హత లేదా!? ఆయన్ని అడ్డుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నది!? ప్రధాని కార్యాలయం విడుదల చేసిన జాబితాలో యంపీ రఘురామకృష్ణంరాజు పేరు ఎందుకు లేదు!? ఇదేనా ప్రొటోకాల్ అంటే!? అవసరం లేని వారి పేర్లు ఉంటాయి..!? ప్రొటోకాల్ అన్న పదాన్ని ఇక ముందు వాడవద్దు దయచేసి! పాటించని నిబంధనలు ఎందుకు!?

ఇక్కడ ఐరనీ ఏమిటంటే..మెలో డ్రామా ఏమిటంటే..!
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ..వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణ .. జయంతి ఉత్సవాలు! అదే వేదికగా ఈనాటి అల్లూరి ..కనుమూరికి నిర్భంధం..అడ్డంకులు..ఆటంకాలు! చోద్యం చూస్తున్న కేంద్ర పెద్దలు! సిగ్గు వెయ్యటం లేదా!? ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకోవటానికి!

తన సానుభూతి పరుల అభ్యర్ధన మేరకు వెనక్కి తగ్గిన రాజుగారు..!
ఒక స్ధాయి కలిగి..బలవంతుడైన యంపీ కే ఇటువంటి పరిస్ధితి ఎదురయితే సామాన్యుడి పరిస్ధితి ఏమిటి!? ఇదే కదా అసలు వ్యూహం! భయభ్రాంతులకు గురిచెయ్యటమే కదా ఉద్దేశం! కాని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నిరంకుశ ధోరణి..అణచివేత..పెచ్చు మీరిపోయాయి. న్యాయస్ధానాలకు విలువ లేదు. ఆదేశాలు పాటించరు. వారికి నిరాబరీగా అండగా నిలుస్తున్న కేంద్ర పెద్దలు కూడా ఈ దుర్మార్గంలో భాగస్వాములే!

ఒకటి మాత్రం నిజం!
నిస్సహాయుల ఆక్రోశం..ఆవేదన నుండి ఆవేశం వస్తుంది. ఆవేషం ..ఉక్రోషంగా మారుతుంది. పౌరుషం పడగవిప్పుతుంది. ఎంతటి నియంతలైనా..నిరంకుశులైనా ప్రజాగ్రహం ముందు తలవంచాల్సిందే!

ఇది చరిత్ర చెప్పిన సత్యం!
ఆనాడు ఈస్టిండియా! ఈనాడు గుజరాత్ ఇండియా!
దేనినైనా వ్యాపారంగా చూడగల..చెయ్యగల వాణిజ్య భావజాలం నరనరాన జీర్ణించుకున్న మూలాలు! ప్రజాస్వామ్యాన్ని ఇవాళ వ్యాపారంగా మార్చారు! ఇది ప్రమాదం! ఈ ప్రమాద ఫలితాలు ప్రస్తుతం తెలుగు వారు రుచి చూస్తున్నారు. మిగతా వారికి శాంపిల్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్క తెలుగువాడు గుర్తించి తగిన నిర్ణయం తీసుకోవలసిన సమయం అయితే వచ్చేసింది. బీ కేర్ ఫుల్!

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

Leave a Reply