Suryaa.co.in

Entertainment Telangana

సాయిపల్లవిపై హైదరాబాదులో పోలీసులకు ఫిర్యాదు

కశ్మీర్ పండిట్ల ఊచకోత అంశాన్ని, ఇటీవల ఆవులను రవాణా చేస్తున్న ఓ ముస్లిం వ్యక్తిపై దాడి ఘటనతో పోల్చిన సినీ నటి సాయిపల్లవి చిక్కుల్లో పడింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, సాయిపల్లవిపై హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు అందింది. కశ్మీర్ ఫైల్స్ సినిమా, గోరక్షకులపై సాయిపల్లవి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, న్యాయ సలహా తీసుకున్న మీదట సాయిపల్లవిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు భజరంగ్ దళ్ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, సాయిపల్లవి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ దుమారం రేగుతోంది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి ఆమె వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారు.

LEAVE A RESPONSE