భట్టి విక్రమార్క, పోలీసుల మధ్య వాగ్వాదం..!

ఖైరతాబాద్-రాజ్‌భవన్‌ రోడ్డులో యుద్ధ వాతావరణం కనిపించింది. కాంగ్రెస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను డీసీపీ జోయల్ డెవిస్‌ ముందుకు తోయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో భట్టి విక్రమార్క, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను తోసేస్తావా అంటూ డీసీపీ జోయల్‌పై ఆయన మండిపడ్డారు. కాగా తమపై అమర్యాదగా ప్రవర్తించిన డీసీపీపై చర్యలు తీసుకోవాలని భట్టి డిమాండ్‌ చేశారు.

Leave a Reply