Suryaa.co.in

Telangana

ప్రజలతో మమేకమవడం నిరంతర ప్రక్రియ

– డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు

ప్రజలతో మమేకమయ్యే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని ఉప సభాపతి పద్మారావు అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సితాఫలమండీ డివిజన్ పరిధిలోని ఎరుకల బస్తీ, జోషి కాంపౌండ్, పిస్లోర్కర్ కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో ఉప సభాపతి పద్మారావు శనివారంDSC-0964 పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని 161 బస్తీలు, కాలనీల్లో అధికారుల బృందాలు పర్యటిస్తున్నాయని పద్మారావు గౌడ్ తెలిపారు. GHMC ద్వారా గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో వివిధ సమస్యలను గుర్తించాము. వాటి పరిష్కారానికి రూ. 14.50 కోట్ల మేరకు నిధులు మంజురయ్యాయి. రూ.9 కోట్లు పట్టణ ప్రగతి పనుల్లో భాగంగా రూ.4.50 కోట్ల మేరకు నిధులను. ఈ పనుల్లో ఇప్పటికే కొన్ని పనులను ప్రారంభం అయ్యాయి.

జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ దశరద్, ఇంజినీర్ ఆశాలత, తాసిల్దార్ అయ్యప్ప, వైద్యాధికారి డాక్టర్ రవీందర్ గౌడ్, డిప్యూటీ జనరల్ మనేజర్ కృష్ణ , అన్విత్ కుమార్ లతో పాటు అన్ని
DSC-0938 విభాగాల అధికారులు, తెరాస యువ నేతలు కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తెలిపిన వివిధ సమస్యలను పరిష్కరించాలని పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు.

LEAVE A RESPONSE