డీకే శివకుమార్‌ ఓ దొంగ.. రేవంత్ రెడ్డి గజ దొంగ

కర్ణాటకలో ఒక్క పధకం కూడా అమలు చేయని డీకే.. ఏ మొహంతో సిగ్గులేకుండా తెలంగాణ గురించి మాట్లాతుండు.?
24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా ?
కేవలం ఐదు గంటలు, మూడు గంటలు పవర్ ఇస్తామన్నా రేటేంత కాంగ్రెస్ కావాలా ?
గార్డెన్ సిటీ అయిన బెంగుళూరు ను గార్బేజ్ సిటీగా మార్చిన ఘనత కాంగ్రెస్ ది
పాలనని గాలికోదిలేసిన డీకే ఏం మొహం పెట్టుకొని తెలంగాణ గురించి మాట్లడుతున్నారు ? అసలు మీకు సిగ్గుందా ?
కర్ణాటకలో రైతు బంధు లేదు, భీమా లేదు, రుణమాఫీ లేదు
మరి ఏ మొహంతో తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు ?
బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్

డీకే శివకుమార్‌ సిబిఐ కేసులో ఓ దొంగ. ఓటుకు నోటు, సీటుకు నోటు గజ దొంగ రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు తోడు దొంగలు తెలంగాణని దోచుకోవడానికి వచ్చిన తోడేళ్ళు:

కెసిఆర్ చేసిన అభివృద్ధి పై డీకే శివకుమార్‌ మాటలు వింటే గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించిదనే సామెతలా వుంది. కర్ణాటకలో ఒక్క పధకం కూడా అమలు చేయని డీకే.. ఏ మొహంతో సిగ్గులేకుండా తెలంగాణ గురించి మాట్లాతుండు.?

ఉచిత కరెంట్ విషయంలో డీకే శివకుమార్‌ స్వయంగా దొంగలా పట్టుబడ్డారు. తాము ఐదు గంటల కరెంటే ఇస్తున్నామని స్వయంగా డీకే శివకుమార్‌ చెప్పడం తెలంగాణ సమాజం అంతా ప్రత్యేక్షంగా చూసింది. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా ? కేవలం ఐదు గంటలు, మూడు గంటలు పవర్ ఇస్తామన్నా రేటేంత కాంగ్రెస్ కావాలా ? కర్ణాటక కాంగ్రెస్ కావాలా ? తెలంగాణ సమాజం లోతుగా అలోచించాలి.

నరకకూపమైన ట్రాఫిక్ సమస్యలతో గార్డెన్ సిటీ అయిన బెంగుళూరు ను గార్బేజ్ సిటీగా మార్చిన ఘనత కాంగ్రెస్ ది. అడ్డగోలుగా కమీషన్స్ తింటూ, పాలనని గాలికోదిలేసిన డీకే ఏం మొహం పెట్టుకొని తెలంగాణ గురించి మాట్లడుతున్నారు ? అసలు మీకు సిగ్గుందా ?

డీకే శివకుమార్‌, మల్లికార్జున్ ఖర్గే లాంటి నాయకులు తీర్ధయాత్ర చేసే పొలిటికల్ టూరిస్ట్ లా ఇక్కడికి వచ్చి తెలంగాణ అభివృద్ధి చూడండి. తెలంగాణ అభివృద్ధి నమూనాని నేర్చుకోండి. కర్ణాటక రాష్ట్రాన్ని ఆదుకోండి.

సొంతపార్టీ ఎమ్మెల్యే గా పోటి చేయాలంటే దానికి రేట్ కార్డ్ పెట్టిన నాయకుడు రేటెంత రెడ్డి. సొంత పార్టీ నాయకులకే టికెట్లు అమ్ముకునే నాయకుడు.. రాష్ట్రాన్ని ఏ రకంగా అమ్మకుతింటాడో ప్రజలు దయచేసి అర్ధం చేసుకోవాలి.

నమ్మకం అంటే బిఆర్ఎస్. అమ్మకం అంటే కాంగ్రెస్. నమ్మకమైన బిఆర్ఎస్ ని మళ్ళీ నిలబెట్టుకుందాం. తోడేళ్ళు, నక్కలు, మిడతల దండులా వచ్చి దాడి చేసి తెలంగాణని దోచుకుతినాలని ప్రయత్నిస్తున్న రేటెంత రెడ్డి, డికే శివకుమార్ లాంటి గజదొంగలకు సరైన గుణపాఠం చెబుదాం.

”డీకే శివకుమార్‌ దేశంలో అతిపెద్ద దోపిడీదారుడు. సిబిఐ రైడ్ లో వేలకోట్ల రూపాయిల అక్రమ సొమ్ముతో పట్టుబడ్డ వైట్ కాలర్ ఫ్రాడ్, క్రిమినల్. అలాంటి గజదొంగని పక్కన పెట్టుకొని ఓటుకు నోటు దొంగ, ఇప్పుడు సీటుకు నోటు దొంగ, బ్లాక్ మెయిలర్, భూకబ్జాకోరైన రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఇద్దరి పక్కపక్క చూస్తుంటే తెలంగాణని దోచుకుతినడానికి సిద్ధమైన తోడేళ్ళులా కనిపిస్తున్నారు” అని మండి బిఆర్ఎస్ సినియర్ నేత డా.దాసోజు శ్రవణ్. కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వికారాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నిర్వహించిన రోడ్‌షోల్లో బిఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు డా.దాసోజు.

ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో డా.దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కొన ఊపిరితో వున్న కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నాయకులని తెప్పించి అసత్య ప్రచారాలు చేస్తూ తెలంగాణ ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. చిల్లర రాజకీయాలు చేస్తూ టికెట్లు అమ్ముకొని రేటెంత కాంగ్రెస్ మారిన ఆ పార్టీ ఇతర రాష్ట్రాల నుంచి నాయకులని తెచ్చి మిడతల దండు లెక్క దండయాత్ర చేస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేక, ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు మాయమాటలతో ప్రజలని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలని అమలు చేశాం ఇక్కడ కూడా అమలు చేస్తామని చిల్లరమాటలు ఆడుతున్నారు డీకే శివకుమార్‌. మా రాష్ట్రానికి రండి పరిపాలన చూపిస్తామని కూడా అంటున్నారు. డీకే శివకుమార్‌ మాటలు చూస్తుంటే గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించినదట అనే సామెత గుర్తుకు వస్తుంది” అని ఎద్దేవా చేశారు దాసోజు.

”కర్ణాటక కటకటలాడుతోంది. అక్కడ కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క గ్యారెంటీ కూడా అమలు కావడం లేదు. కర్ణాటక రైతాంగం, నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక మొత్తం అంధకారంలో వుంది. ఒక్క పధకం కూడా అమలు కాలేదు. కర్ణాటకలో అంత అద్వాన చేసిన చేసిన డీకే శివకుమార్.. తెలంగాణలోకి వచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చెప్పడం హాస్యాస్పదం.” అని వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్ కర్ణాటక రమ్మని సవాల్ చేసిన డీకే శివకుమార్.. తెలంగాణలో ఏదైనా ఇంటిని సందర్శించి, ఏ ముసలవ్వనైనా పెన్షన్ ఎంత వస్తుందని అడిగితే డీకే మూతిపగలగొట్టె సమాధానం ఇస్తారు. తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం రూ.2016 పెన్షన్ ఇస్తే కర్ణాటక వెయ్యి ఇస్తున్నారు అది కూడ పూర్తిగా అమలు చేస్తున్న పరిస్థితి లేదు. ఏ రైతన్న దగ్గరికి వెళ్ళినా కేసీఆర్ రైతులకు కన్నతండ్రిలా ఎలా అందుకుంటున్నారు.

రైతు బంధం, రైతు భీమా ఎలా ఇస్తున్నారు, లక్ష రూపాయిల రుణమాఫీ చేసిన రైతుకు పెద్దన్నలా ఎలా ఆడుకుంటున్నారో చెప్తారు. మరి కర్ణాటక సంగతి ఏమిటి ? కర్ణాటకలో రైతు బంధు లేదు, భీమా లేదు, రుణమాఫీ లేదు. మరి ఏ మొహంతో తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు ? అని ధ్వజమెత్తారు.

ఉచిత కరెంట్ విషయంలో డీకే శివకుమార్‌ స్వయంగా దొంగలా పట్టుబడ్డారు. తాము ఐదు గంటల కరెంటే ఇస్తున్నామని స్వయంగా డీకే శివకుమార్‌ చెప్పడం తెలంగాణ సమాజం అంతా ప్రత్యేక్షంగా చూసింది. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా ? కేవలం ఐదు గంటలు, మూడు గంటలు పవర్ ఇస్తామన్నా రేటేంత కాంగ్రెస్ కావాలా ? కర్ణాటక కాంగ్రెస్ కావాలా ? తెలంగాణ సమాజం అలోచించాల్సిన అవసరం వుంది.

డీకే శివకుమార్‌, మల్లికార్జున్ ఖర్గే లాంటి నాయకులు తీర్ధయాత్ర చేసే పొలిటికల్ టూరిస్ట్ లా ఇక్కడికి వచ్చి తెలంగాణ అభివృద్ధి చూడండి. తెలంగాణ అభివృద్ధి నమూనాని నేర్చుకోండి. కర్ణాటక రాష్ట్రాన్ని ఆదుకోండి. తెలంగాణ వచ్చిన కొత్తల్లో 68 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి వుంటే గత పదేళ్ళలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగం చెమటోడ్చి పంటలు పండిస్తే ఈవాళ వరి ఉత్పత్తి 3కోట్ల టన్నులకి చేరింది. కర్ణాటకలో ఎంత ఉత్పత్తి అవుతుందో డికే చెప్పాలి ? ఎందుకు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

దేశంలో స్వచ్చమైన మంచి నీరు అందించే నెంబర్ 1 స్టేట్ తెలంగాణ. కర్ణాటక 20 స్థానంలో వుంది. డీకె ఏ మొహం పెట్టుకొని తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు ? ఏ మొహంతో ఓటు అడుగుతున్నారు ? అని ప్రశ్నించారు.

నేడు తెలంగాణ పల్లెలు పట్టుకొమ్మలుగా మారాయి. ప్రతి పల్లెలో స్కూల్స్, పార్కులు, చెరువులు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, ప్రక్రుతి వబాలు, అన్నీ మౌలిక వసతులతో పల్లెలు స్వర్గధామాలుగా మారాయి. మహాత్మా గాంధీజీ కలలు గ్రామస్వరాజ్యం సాకారమైయింది. మరి కర్ణాటక పరిస్థితి ఏమిటి?

జాతీయ పంచాయితీ అవార్డ్స్ లో తెలంగాణ గ్రామల అభివృద్ధి చూసి ఎనిమిది జాతీయ అవార్డులు వస్తే .. కర్ణాటకకి ఒక్క అవార్డు కూడా రాలేదు. మొత్తం మరుగుదొడ్లు వున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మరి మీ పరిస్థితి ఏమిటి ? సొంత ఇంటిని బాగో చేసుకోలేని డీకే ఇక్కడ తెలంగాణ పై బదరజల్లే ప్రయత్నం మానుకోవాలి’’ అని సూచించారు.

2014లో ఐటీ ఎగుమతులు 56వేల కోట్లు వుంటే గత పదేళ్ళలో కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నేతృత్వంలో 2.8 లక్షల కోట్ల టీ ఎగుమతులు సాధించాం. గతంలో మూడు లక్షల ఐటీ ఉద్యోగాలు వుంటే ఈ పదేళ్ళలో తొమ్మిది లక్షల ఉద్యోగాలకు చేరాం అద్భుతమైన మౌళిక వసతులతో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా బ్రహ్మండమైన నగరంగా హైదరాబాద్ అభివృద్ధి సాధించింది. మరి కర్ణాటక మాట ఏమిటి ?

నరకకూపమైన ట్రాఫిక్ సమస్యలతో గార్డెన్ సిటీ అయిన కర్ణాటకని గార్బేజ్ సిటీగా మార్చిన ఘనత మీది? అడ్డగోలుగా కమీషన్స్ తింటూ, పాలనని గాలికోదిలేసిన మీరు ఏం మొహం పెట్టుకొని తెలంగాణ గురించి మాట్లడుతున్నారు ? అసలు మీకు సిగ్గుందా ? అని దజమెత్తారు దాసోజు.

కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీగా మారింది. దొంగలు దొంగలు కలిసి దోచుకునట్లు ఇటు రేటెంత రెడ్డి, అటు కర్ణాటక కాంగ్రెస్ దొంగలు తెలంగాణ ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2014లో అరవైవేల కోట్ల రూపాయలు బడ్జెట్ తో వున్న తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల ఇరవై వేల కోట్ల బడ్జెట్ రాష్ట్రంగా మారింది. కేసీఆర్ నాయకత్వంలో మనమందరం కలసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం.

ఇపుడా సంపదని దోచుకోవడానికి రేటెంత రెడ్డి కాంగ్రెస్., పక్క రాష్ట్రం నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు నక్కల్లా, రాబంధుల్లా తోడేళ్ళ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకడు ఓటుకు నోటు దొంగ, ఇంకొకడు వేలకోట్లు దోచుకొని సిబిఐకి దొరికిన గజదొంగ. వీళ్ళు తెలంగాణని అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలి.. ప్రజలు లోతుగా ఆలోచన చేసుకోవాలి’’ అని కోరారు దాసోజు .

సొంతపార్టీ ఎమ్మెల్యే గా పోటి చేయాలంటే దానికి రేట్ కార్డ్ పెట్టిన నాయకుడు రేటెంత రెడ్డి. సొంత పార్టీ నాయకులకే టికెట్లు అమ్ముకునే నాయకుడు.. రాష్ట్రాన్ని ఏ రకంగా అమ్మకుతింటాడో ప్రజలు దయచేసి అర్ధం చేసుకోవాలి’’ అని కోరారు

‘’నమ్మకం అంటే బిఆర్ఎస్. అమ్మకం అంటే కాంగ్రెస్. నమ్మకమైన బిఆర్ఎస్ ని మళ్ళీ నిలబెట్టుకుందాం. కేసీఆర్ నిండైన మనసు వున్న వ్యక్తి. ధైర్యం, కరుణ, అకింతభావం, దూరదృష్టి కలిగిన నాయకుడు ఇవాళ తెలంగాణకి వున్నారు. అలాంటి నాయకుడిపై ఇవాళ తోడేళ్ళు, నక్కలు, మిడతల దండులా వచ్చి దాడి చేసి తెలంగాణని దోచుకుతినాలని ప్రయత్నిస్తున్న రేటెంత రెడ్డి, డికే శివకుమార్ లాంటి గజదొంగలకు సరైన గుణపాఠం చెప్పాలి’ అని కోరారు డా. దాసోజు.

Leave a Reply