Suryaa.co.in

Andhra Pradesh Entertainment National

తెలుగు వారు గర్వంగా చెప్పుకునే మహానాయకుడు ఎన్టీఆర్

-ఎన్టీఆర్ ది వ్యక్తిగా, రాజకీయ శక్తిగా విలక్షణ వ్యక్తిత్వం
-ఆయన పాలన అందరికీ ఆదర్శమని వ్యాఖ్య
-యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు
-ఉపరాష్ట్రపతి వెంకయ్య

మావాడు అని తెలుగువారంతా గర్వంగా చెప్పుకునే మహానటుడు, మహా నాయకుడు నందమూరి తారకరామారావు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ వెంకయ్య నివాళులర్పించారు. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్ ది విలక్షణమైన వ్యక్తిత్వమని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో, అంత్యోదయ మార్గంలో ఎన్టీఆర్ పరిపాలన సాగిందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిలిచిన ఆయన పాలన ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ఆ మహానాయకుడి స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకోవాలని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని వెంకయ్య ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE