జలకాలాటలలో
కిలకిల పాటలలో
ఏమి హాయిలే హలా..
విజయలక్ష్మి
నాగినిలా నర్తిస్తే
పామే కదిలినట్టుంటుంది
జరాజరా..!
ఒసే..ఒలే..ఏమిటే..
ఇంద్రకుమారి..నాగకుమారి
ఇద్దరిదీ ఆ మాటే..
నాకు మగవాసన కొడుతోందంటూ
పాము జడను చూపిన
జగదేకవీరుడి ఇల్లాలు..
త్రిశోక రాజుకు..
ప్రెగ్గడ మంత్రికి
చూపించింది చుక్కలు!
రాముడు..భీముడులో
భీమునితో జత కట్టి..
దేశమ్ము మారిందొయ్..
కాలమ్ము మారిందోయ్
అంటూ ప్రాజెక్టునే కట్టిన
విజయలక్ష్మి గజ్జె కడితే
తళుకు తళుకు!
ఉత్తరగా మురిసి..
గుండమ్మ కోడలిగా మెరిసి..
పరమానందయ్య శిష్యుల కథలో రంజనిగా ఊపేసిన
వెండితెర నాగిని…
సినిమాలకి సడెన్ గా
గుడ్ బై చెప్పి..
దత్తాతో వివాహం..
అమెరికా పయనం..
ఆపై వ్యవసాయంలో
ఉన్నత చదువు..
వర్జీనియాలో కొలువు..
ఎక్కడున్నా ఆమెకు
తృప్తినిచ్చేది డాన్స్..
ఆ కళ మెచ్చే
ఆమెకు వేల కొద్దీ ఫ్యాన్స్!
(అభినేత్రి..నాట్యమయూరి ఎల్.విజయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలతో..)
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286