తెలుగు జాతికి గర్వకారణం ఎన్టీఆర్

  • ‘ఈనాడు’ అధినేత రామోజీరావు

తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నలుదిశలా చాటిన మహనీయుడు ఎన్టీఆర్ శత జయంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు స్మరించుకున్నారు. వెండి తెరపై నవరసాలు పండించిన మహానటుడు, అశేష అభిమానుల హృదయసీమను అవిఘ్నంగా ఏలిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆ మహామనిషి శత జయంతి సందర్భంగా అందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.

ఎన్టీఆర్ తెలుగు నేలపై ప్రభవించడం తెలుగువారిగా మనందరి అదృష్టమని చెప్పారు. కృషి, దీక్ష, పట్టుదలకు ప్రతీకగా, నియమ నిష్టలకు, క్రమశిక్షణకు మారుపేరుగా ఆఖరి క్షణం వరకు జీవితాన్ని సాగించిన వికసిత వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ ద్వారా తన అంతరంగాన్ని తెలియజేశారు.

Leave a Reply