Suryaa.co.in

Andhra Pradesh

మోదీతో జనసేన ఎంపీల సమావేశం

– రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులకు సహకరించాలని వినతి

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ని జనసేన పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలు ఆంధ్రప్రదేశ్ కు ఉండాలని, రాష్ట్ర అభివృద్ధిని ముందుండి నడిపించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు, రాష్ట్ర విభజన అంశాలు, కేంద్ర నుంచి రావాల్సిన గ్రాంట్లు అంశాలను నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో టూరిజం అభివృద్ధికీ, జాతీయ విద్యాసంస్థ నెలకొల్పడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE