Suryaa.co.in

Entertainment

ప్రముఖ నటి మీనా భర్త మృతి

టాలీవుడ్ ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం బారినపడి గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త విద్యాసాగర్ (48) గత రాత్రి చెన్నైలో మృతి చెందారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన విద్యాసాగర్‌ను 2009లో మీనా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. జనవరిలో మీనా కుటుంబం కరోనా బారినపడింది. ఆ తర్వాత వారు కోలుకున్నప్పటికీ విద్యాసాగర్ మాత్రం లివర్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు.

అది మరింత తీవ్రం కావడంతో చెన్నైలోని ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో ఆయనకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని నిర్ణయించినప్పటికీ కుదరలేదు. అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి కన్నుమూశారు. విద్యాసాగర్ మరణవార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసాగర్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి.

LEAVE A RESPONSE