సెకండ్ సిలిండర్ తీసుకుంటే ‘ఆర్ ఆర్ ఆర్’ టికెట్లు ఉచితం

– గుంటూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ బంపర్ ఆఫర్
– ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ విడుదల
– తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ మేనియా
– దుగ్గిరాలలో హెచ్.పి గ్యాస్ కంపెనీ వినూత్న ఆఫర్
– సినిమా టికెట్లు ఇంటికి వెళ్లి మరీ అందిస్తామని వెల్లడి

తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ మేనియా మరింత పెరిగింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న రిలీజ్ అవుతోంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ క్రేజ్ ను సొమ్ము చేసుకునేందుకు గుంటూరు జిల్లాలో ఓ గ్యాస్ ఏజెన్సీ వినూత్న ఆఫర్ ప్రకటించింది.

దుగ్గిరాలలో హెచ్.పి కంపెనీ గ్యాస్ డీలర్ ఈ ఆఫర్ తీసుకువచ్చారు. సింగిల్ సిలిండర్ వినియోగదారులు రెండో సిలిండర్ తీసుకుంటే ఆర్ఆర్ఆర్ టికెట్లు ఉచితంగా అందిస్తామని తమ కార్యాలయం వద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. అది కూడా రిలీజ్ రోజున ఇంటికి వచ్చి మరీ టికెట్లు అందజేస్తామని ప్రకటించారు.

ఈ గ్యాస్ ఏజెన్సీ గతంలో బాహుబలి-2 చిత్రం సమయంలోనూ ఇలాగే ఫ్రీ టికెట్లు ప్రకటించింది. తాజా ప్రకటన చేసిన కాసేపటికే మూడు సెకండ్ సిలిండర్లు బుక్ అయ్యాయని సదరు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి వెల్లడించారు. దుగ్గిరాల సరోజిని థియేటర్ లో వారు ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకు టికెట్లను ఇంటికి వెళ్లి అందిస్తామని తెలిపారు.

Leave a Reply