Home » సం’దేశమే’ సినిమా

సం’దేశమే’ సినిమా

గూడవల్లి రామబ్రహ్మం
పత్రిక కంటే
సినిమా బలమైన
మాధ్యమమని నమ్మి
అటువైపు అడుగులేసిన
గూడవల్లి సంధించిన
అస్త్రం మాలపిల్ల..
మెచ్చిరి నాటి జనులెల్ల..!

సినిమాలో సాహసానికి
మరో పేరు ఈ బ్రహ్మం..
రైతుబిడ్డ మరో బ్రహ్మాస్త్రం
పెత్తందారీ వ్యవస్థ
దుర్మార్గాలను నిలువునా
చీల్చి చెండాడిన
సెల్యూలాయిడ్ శస్త్రం
అలాంటి సినిమాలు తియ్యడమే గూడవల్లి
నేర్చిన శాస్త్రం!

సినిమాని వ్యాపారంగా కాక
సందేశంగా మలచిన రుషి..
హరిజనోద్యమమే ఇతివృత్తమై సాగిన మాలపిల్ల..ఓ సంచలనం..
సంస్కరణల సంకలనం..
సంస్కర్తల సమాగమం..
చలం కలం కథనంతో
కదం తొక్కింది..
తాపీ మాటలు..
కత్తుల మూటలు..
బసవరాజు పాటలూ
చక్కగా అమరి..
నాటి జనం ఆస్వాదించారు
కొసరి కొసరి..!

అదే బాటలో పల్నాటియుద్ధం..
కులవ్యవస్థపై
బ్రహ్మనాయుడి రూపంలో
బ్రహ్మం సాధించిన పోరు..
రికార్డుల హోరు..!

అన్నట్టు..అందాల
‘కాంచనమాల’పిల్ల
రామబ్రహ్మమే చెక్కిన శిల్పం
తొలి సూపర్ స్టారై..
జిలుగుల తారై..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply