ముస్లింలు ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి పని చేస్తారు

– చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టీలో చేరుతున్నారు…
– పార్టీలో చేరి పార్టీ కోసం పనిచేసిన ఏ కార్యకర్తను విస్మరించేది లేదు…
– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్లో గురువారం నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నాయకత్వంలో, 42 వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ అబ్దుల్ మస్తాన్ ఆధ్వర్యంలో వందలాది మంది టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పోలిట్బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య తదితరులు హాజరయ్యారు… పార్టీలో చేరిన వారికి సోమిరెడ్డి, అజీజ్, కోటంరెడ్డి లు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ మైనార్టీ అధ్యక్షులు మైనుద్దిన్ సభా అధ్యక్షత వహించారు…

ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ…చంద్రబాబు కు మించిన పరిపాలన జగన్ మోహన్ రెడ్డి అందిస్తారని నమ్మి గత ఎన్నికల్లో మైనార్టీ సోదరులు అందరూ జగన్మోహన్రెడ్డి వైపు మొగ్గు చూపారని తెలిపారు.గడిచిన 3 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం చితికి పోయిందని రాష్ట్ర ప్రతిష్ట మసకబారిన పోయిందని అన్ని కులాల మతాల వర్గాల వారు ఆర్థికంగా రాజకీయంగా దెబ్బతిన్నారు అని తెలిపారు. జగన్ రెడ్డి పాలనతో విసిగిపోయిన సోదరులు, చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమని నేడు టిడిపిలోకి అనేక మంది చేరుతున్నారని తెలిపారు.నవరత్నాలు మాత్రమే చేస్తానని చెప్పి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని రద్దు చేశారని అన్ని వర్గాల వారికి జరగాల్సిన మేలును తుంగలోతొక్కారు అని తెలిపారు. పండుగ కానుకలు ముస్లిం కార్పొరేషన్ నిధులు ఎస్సీ కార్పొరేషన్ నిధులు, బిడ్డల పెళ్లిళ్లకు కానుకలు బీమా సౌకర్యం ఇలాంటివి ఎన్నో నిర్వీర్యం చేశారని ఎద్దేవా చేశారు. రైతులకు కూడా తీరని అన్యాయం చేశారు. ఇవన్నీ గమనించిన ప్రజలు ఏ క్షణాన ఏ ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నారని జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడుతారని తెలిపారు..

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేసిన వందలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులు సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రభుత్వం పై పోరాడిన వారి ఇంటి ముందు నిలబడిపోతున్నారు అని తెలిపారు. అలాంటి బుడ్డ బెదిరింపులకు భయపడకుండా ఈ మూడేళ్ల కాలం వైసిపికి పనిచేసిన కార్యకర్తలు టిడిపితోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని టిడిపిలో చేరుతున్నారని తెలిపారు.రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే అడు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి తోనే సాధ్యం అవుతుందని రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారని తెలిపారు. జగన్ రెడ్డి మైనార్టీలను మోసం చేస్తూనే వచ్చారని మైనారిటీలకు రావాల్సిన ఈ ఒక్క సంక్షేమాన్ని కూడా అందించలేకపోయారు అని వాటిని నిర్వీర్యం చేశారని తెలిపారు.స్వయానా తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను కూడా రద్దు చేశారని విమర్శించారు. ముస్లిం ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం, పేదవారి చదువుల కోసం వారి వ్యాపారాల కోసం ప్రవేశపెట్టిన పథకాల నీటిని రద్దు చేశారని తెలిపారు.అబద్ధపు హామీలతో మోసపు హామీలతో అన్ని వర్గాల ప్రజలకు జగన్మోహన్రెడ్డి వెన్నుపోటు పొడిచారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మీడియాతో మాట్లాడుతూ….ముస్లింలు ఒక మాట ఇస్తే అదే మాటకి కట్టుబడి ఉంటారనీ తెలిపారు.టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గడిచిన ఈ మూడేళ్లలో ఎక్కడ ఒక అభివృద్ధి కూడా జరగలేదు అని ఎద్దేవా చేశారు.రాజకీయాల్లో ఎటువంటి అవినీతి మచ్చలేని వ్యక్తి, రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు పోగొట్టుకున్న ఏకైక వ్యక్తి అబ్దుల్ అజీజ్ అని కొనియాడారు. తను డబ్బు మూటలతో రాజకీయాల్లోకి రాలేదని జెండా పట్టిన కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగానని తెలిపారు.కార్యకర్తల కష్టంతోనే తాను ఇంత స్థాయికి ఎదిగానని నేడు పార్టీలో చేరుతున్న ప్రతి కార్యకర్త ను కోడి తన పిల్లలను కాపాడుకున్న కాపాడుకుంటాను అని తెలిపారు.42 43 వ డివిజన్ నెల్లూరు మస్తాన్ లను అక్రమంగా ఓడించారని, రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో వారిరువురునీ పోటీ లేకుండానే గెలిపిస్తామని తెలిపారు.24/7 కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ తో తమ ముందు వాలిపోతా అని తెలిపారు. కార్యక్రమంలో మొహమ్మద్ జాఫర్ షరీఫ్, హయత్ బాబా, నౌషాద్, కప్పిర శ్రీనివాసులు, సాబీర్ ఖాన్, ఇక్బాల్, కువ్వరపు బాలాజీ,నాగేంద్ర,పసుపులేటి మల్లికార్జున్, ఉస్మాన్,జఫర్,రేవతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply