Suryaa.co.in

Entertainment

లైగర్ చూడ‌ద‌గ్గ చిత్రం అయితే కాదు..!

ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రధాన పాత్ర‌లో లైగ‌ర్ అనే సినిమాని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ అనన్య పాండే , మైక్ టైసన్, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో లైగర్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. లైగర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుద‌లైంది. చిత్ర క‌థ ఎలా ఉందో చూద్దాం..

క‌థ‌:
ముంబై బ్యాక్‌డ్రాప్‌లో లైగ‌ర్ క‌థ న‌డుస్తుంది. లైగర్( విజ‌య్ దేవ‌ర‌కొండ‌) కు దేశంలో గొప్ప ఫైటర్ గా ఎదగాలని ఆశ ఉంటుంది. అయితే అత‌నికి న‌త్తి స‌మ‌స్య ఉండ‌డం వ‌ల‌న అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటాడు. తాను అనుకున్న గోల్ రీచ్ అవ‌డానికి లైగ‌ర్ త‌ల్లి బాలామ‌ణి( ర‌మ్య‌కృష్ణ‌) ఎలాంటి మ‌ద్ద‌తు ఇస్తుంది? అన‌న్య పాండేతోల‌వ్ ట్రాక్ అత‌ని జీవితంలో కీల‌కం అవుతుందా అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్:
లైగర్‌గా విజయ్ చాలా సన్నివేశాల్లో నత్తి తో చాలా బాగా చేసాడు, అయితే కొన్ని కోర్ ఎమోషన్స్‌ని ప్రదర్శించడంలో మాత్రం విఫలమయ్యాడు. బాక్సర్‌గా కనిపించేలా అతని మేక్ ఓవర్ మనం అభినందించాలి, అనన్య పాండేకి నటనకు స్కోప్‌ లేదు, బాలమణిగా రమ్యకృష్ణ చాలా అద్భుతంగా చేసింది, ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని అద్భుతంగా కుదిరాయి, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే మరియు గెటప్ శ్రీను తమ పాత్రల మేరకు బాగా చేసారు. మైక్ టైసన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది కానీ అతని పాత్రలో సరైన డెప్త్ లేదు. బాక్సింగ్ కోచ్‌గా రోహిత్ రాయ్ బాగానే చేశాడు.

టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్:
పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమాలో మ‌ళ్లీ నిరాశ‌ప‌రిచాడు ఈ సినిమాలో పూరి మార్క్ క‌నిపిస్తుంది, కానీ అతని పాత సినిమాల మాదిరిగా అయితే ఉండదు , ఈసారి అతను హీరో కంటే కథపై ఎక్కువగా దృష్టి పెట్టాడు, అయినప్పటికీ, అతను ప్రేక్షకులను కట్టిపడేయడంలో సక్సెస్ కాలేక‌పోయారు. సినిమా మొత్తాన్ని కలర్‌ఫుల్‌గా చూపించే ప్రయత్నం చేసిన విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ వర్క్ ఓకే. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ వర్క్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. మిగిలిన సాంకేతిక విభాగాలు తమ వంతు కృషి చేసారు.

ప్ల‌స్ పాయింట్స్:
విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌
త‌ల్లీ కొడుకుల స‌న్నివేశాలు

మైన‌స్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
ద‌ర్శ‌క‌త్వం
నాన్‌సింక్ సీన్స్

విశ్లేష‌ణ‌:
భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన లైగ‌ర్ దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. సినిమా మొదటి భాగం కాస్త ఫర్వాలేదనిపించినా, సెకండాఫ్‌ మాత్రం చాలా దారుణంగా ఉంది. క్లూలెస్‌ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పూర్తిగా నెగటివ్‌ సైడ్‌ టర్న్ తీసుకుంటుంది. అధ్వాన్న‌మైన రచన, భయంకరమైన స్క్రీన్‌ ప్లే ఆడియెన్స్ కి తెగ బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ మరీ డిజప్పాయింట్‌ చేస్తుంది. సినిమాలో అసలు కథే లేక‌పోగా, కేవలం స్క్రీన్‌ప్లే, మాంటేజ్‌లు మాత్రమే ఉన్నాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా కోసం బాగానే క‌ష్ట‌ప‌డ్డ‌ప్ప‌టికీ, మూవీకి సోల్ మిస్ కావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తేలిపోయింది. ఈ మూవీ విజ‌య్ కెరీర్‌ల మ‌రొక అట్ట‌ర్ ఫ్లాప్ చిత్రంగా నిలిచిపోవ‌డం ఖాయం. హీరో క్యారెక్టరైజేషన్‌, డైలాగ్‌లు పూరీ జగన్నాథ్‌ బలాలు. ఇందులో అన్ని మిస్ అయ్యాయి. మైక్‌ టైసన్ పాత్రని కామెడీగా మార్చేయ‌గా, రమ్యకృష్ణ ప్రయత్నం వృధానే అయింది. సినిమా ఏ టైమ్‌లో ఎటు ఎటువెళ్తుందో అర్థంకాని విధంగా సాగింది.

– సేకరణ : సంపత్‌రాజు

LEAVE A RESPONSE