గంతేస్తే గరం గరమే!

ఆమె..
పేరుకి శృంగార నటి..
ముద్దు పేరు వ్యాంప్..
ఇప్పుడైతే హీరోయిన్లే
రెండు గుడ్డ ముక్కలు చుట్టి
ఊ..అంటావా..ఆంటూ..
జిగేలు రాణి..అనుకుంటూ చీకులమ్మేస్తూ
చేసేస్తున్న డ్యాన్సులు
నిజం చెప్పాలంటే
అంతకంటే కాస్త సంప్రదాయంగా
ఆడిన ముద్దుగుమ్మలు..
జ్యోతిలక్ష్మి..జయమాలిని..
హలం.. జయకుమారి..
అనురాధ…కుయిలీ..
సిల్క్ స్మిత..
ఈ అందరికీ మధ్యస్థంగా
మన రౌడీరాణి
విజయలలిత,.
ఓ ధీరవనిత..!

ము ము ము ము
ముద్దంటే చేదా..
ఇపుడా ఉద్దేశం లేదా..
అక్కినేనిని
కవ్వించిన సొగసు..
ఆరాధనలో రామారావుకు
తెలిసిన చెల్లి మనసు..
కురిసింది వాన..
నా గుండెలోన…
నీ చూపులే జల్లుగా..
బుల్లోడిని బులిపించిన అందం..
ఆ అందం కోసం పందెం..
క్లబ్బు డాన్సులతో కాక..
మద్దమద్దిలో
సంప్రదాయపు కోక…
చైర్మన్ చలమయ్యనే
మురిపించిన సీతాకోకచిలక!

గంతులేసి చలాకీగా
పట్టింది తుపాకీ..
టైటు ప్యాంటు..చొక్కా
హేటు..బూటు..
రౌడీరాణి..రివాల్వర్ రాణి..
కొట్టి బోణీ..
అదో సంచలన బాణీ..
ఆంధ్రా నాడియా..
సంబరంతో జనం తాలియా..

విజయశాంతి
ఒక తరం
లేడీ సూపర్ స్టార్..
అంతకు ముందే
ఈ పిన్నమ్మ పెద్ద స్టార్..
వీరోచిత పోరాటాలు..
గుర్రపు స్వారీలు..
అదరగొట్టే స్టోరీలు..
కొన్నాళ్ళు ఎక్కడ విన్నా
విజయలలిత పేరే..
అన్నట్టు..క్రమశిక్షణలో
ఆమె ఎన్టీఆర్ తీరే..!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply