Suryaa.co.in

Andhra Pradesh

వర్ల రామయ్య పిర్యాదుపై తీవ్రంగా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమీషన్

– డీజీపీకి నోటీసులు జారీ చేసిన కమిషన్

చిత్తూరు జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఇంటి పనిమనిషిగా చేసిన దళిత మహిళ ఉమామహేశ్వరిపై అక్రమ దొంగతనం కేసు నమోదు. వేణుగోపాల్ రెడ్డి ప్రమేయంతో దళిత మహిళను చిత్రహింసలకు గురిచేసిన పోలీసులు. చేయని దొంగతనం ఒప్పుకోవాలంటూ దళిత మహిళ ఉమామహేశ్వరిపై చేసిన కస్టోడియల్ టార్చర్ పై స్పదించి కమిషన్ కు పిర్యాదు చేసిన వర్ల. దళిత మహిళపై చిత్రహింసలను తీవ్రంగా పరిణిస్తున్నామని పోలీసులను హెచ్చరించిన కమీషన్.పిర్యాదులో పేర్కొన్న అంశాలు చూస్తుంటే బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల మానవ హక్కులు తీవ్ర ఉల్లంఘనలకు గురైనట్లు కనిపిస్తున్నాయన్న కమిషన్. ఐజీ స్థాయి అధికారితో స్వతంత్ర విచారణ చేపట్టి నాలుగు వారాల్లో నివేదిక పంపాలని డీజీపీకి నోటీసులు జారీ చేసిన కమిషన్.ఎన్.హెచ్.ఆర్.సి ఈ స్థాయిలో తీవ్రంగా స్పందించి డీజీపీకి నోటుసులు జారీ చేయడం ఇదే తొలిసారి.

LEAVE A RESPONSE