Suryaa.co.in

Andhra Pradesh Entertainment

అనంతపురంలో హీరో బాలకృష్ణ సందడి

– అనంతపురంలో తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటులు, నందమూరి బాలకృష్ణ సందడి.. అభిమాన సంఘం అధ్యక్షుడి కుమార్తె వివాహానికి హాజరు

అనంతపురంలో హీరో బాలకృష్ణ సందడి చేశారు. బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ కుమార్తె వివాహానికి హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు.అనంతపురంలో హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. జిల్లా అభిమాన సంఘం అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ కుమార్తె వివాహానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నగర శివారులోని ఎం.వై.ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ పాల్గొనడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాలయ్య రాకతో పెళ్లిలో సందడి నెలకొంది. బాలకృష్ణ వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.గౌస్ మొహిద్దీన్ తెదేపా కార్యకర్తగా ఉంటూ గతంలో గ్రంథాలయ ఛైర్మన్గా పని చేశారు. ఈ కార్యక్రమానికి తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునితమ్మ, ఇతర నాయకులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

LEAVE A RESPONSE