Suryaa.co.in

Entertainment

కొందరు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు

– రేణూ దేశాయ్‌ పోస్ట్‌

నటి రేణూ దేశాయ్‌. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ తన సినిమా విషయాలను, వ్యక్తిగత సమాచారాన్ని అభిమానుతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా రేణూ దేశాయ్‌ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్‌ వైరలవుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న వీడియో పెట్టిన ఆమె అందమైన నోట్‌ను రాశారు..

”కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వాళ్ల పరిచయం మండు వేసవిలో చల్ల గాలిలా మనసుకు ఊరటనిస్తుంది. వాళ్ల చూపులు నేరుగా మన హృదయంతో మాట్లాడతాయి. అది ఒక అందమైన భాష. మనం వాళ్లతో కొన్ని గంటల సమయం గడిపినప్పటికీ.. వాళ్ల ప్రభావం మనపై జీవితాంతం ఉంటుంది. అలాంటి పరిచయాల్లో కొన్ని మనల్ని బాధపెడతాయి కూడా. వాళ్లు మన జీవితానికి పరిపూర్ణతను ఇస్తారు. మన కన్నీళ్లను తుడిచి.. మన జీవితాల్లో వెలుగును నింపుతారు. మనల్ని నవ్విస్తుంటారు” అని రేణూ దేశాయ్‌ తన పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అకీరాతో కలిసి ఆమె ప్రయాణిస్తోన్న వీడియో కూడా నెట్టింట సందడి చేసింది.

ఇక కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేణూ దేశాయ్ త్వరలోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల విరామం తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. హేమలతా లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో రేణు కనిపించనున్నారు.

LEAVE A RESPONSE