సిద్దిపేట అదనపు కలెక్టర్‌కు కుక్కకాటు

సిద్దిపేట కలెక్టరేట్‌లో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని కుక్కలు తీవ్రంగా కరిచాయి. కలెక్టర్‌ పెంపుడు శునకమూ తీవ్రంగా గాయపడింది. ఈ విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

సిద్దిపేట శివారులో కలెక్టరేట్‌తోపాటు అధికారుల నివాసాలు ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేదీన రాత్రి అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తాను నివాసముంటున్న క్వార్టర్స్‌ ఆవరణలో వాకింగ్‌ చేస్తుండగా ఓ వీధి కుక్క కరిచింది. ఆయన రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్ర రక్త గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కలెక్టరేట్‌కు సమీపంలోని పౌల్ట్రీఫాం వద్ద కూడా ఓ బాలుడు కుక్కకాటుకు గురయ్యాడు. దాంతో అధికారుల కుటుంబాల సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Leave a Reply