తాతయ్య బయోపిక్ తీస్తా

-అత్యున్నత ప్రమాణాలతో గ్రీన్ మ్యాట్ స్టూడియో,ఆడియో మిక్సింగ్-ఎడిటింగ్ & డబ్బింగ్ స్టూడియో ఏర్పాటు!!
-షూటింగ్స్ కి సువర్ణావకాశం!!
-స్వర్గీయ భారత ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు మనవరాలు శ్రీమతి అజిత

ఫార్మసీ-ఆర్కిటెక్చర్-ఫైన్ ఆర్ట్స్ -ఫోటోగ్రఫీలలో డిప్లొమా మొదలుకుని… పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు డాక్టరేట్ వరకు విద్యనందిస్తున్న ప్రతిష్టాత్మక కళాశాలలు అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తూనే… తన తాతగారు పి.వి.నరసింహారావు జీవితాన్ని తెరకెక్కించి… నేటి యువతలో స్ఫూర్తి నింపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బహుముఖ ప్రతిభాశాలి శ్రీమతి అజిత. ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కోసం కళాశాల ప్రాంగణంలోనే అత్యంత ఆధునాతనంగా.. గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఆడియో మిక్సింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోలను నెలకొల్పిన అజిత… చిన్న, మధ్య తరగతి నిర్మాతలకు లాభాపేక్ష లేకుండా వాటిని అందుబాటులో ఉంచేందుకు సంకల్పిస్తున్నారు. అంతేకాదు మూడెకరాల విస్తీర్ణంలో నిర్మించిన సువిశాల భవంతుల్లో పలు రకాల సన్నివేశాలు షూటింగ్స్ చేసుకునే వీలు కూడా కల్పిస్తున్నారు!!

తన తాతగారి బయోపిక్ కోసం ప్రస్తుతం టి.ఆర్.ఎస్.పార్టీలో “ఎమ్.ఎల్.సి”గా సేవలందిస్తున్న తన తల్లి వాణీదేవి సలహాలు సూచనలు తీసుకుంటున్నానని అజిత తెలిపారు. తన తాతగారి బహుభాషా ప్రావీణ్యం, అసాధారణ రాజకీయ చాతుర్యంతో పాటు… బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో విషయాలను ఈ బయోపిక్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని అజిత వివరించారు!!

భారతదేశం గర్వించదగ్గ ఓ మహా నాయకుడి మనవరాలు అయినా అత్యంత సాదాసీదాగా ఉండే అజిత… తమ ఫిల్మ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ.. “త్వరలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. మా దగ్గరున్న గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఆడియో మిక్సింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ యూనిట్ లను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా సినిమా రంగానికి మావంతు సేవలందించాలని భావిస్తున్నాం. అలాగే ఈ ప్రాంగణంలో షూటింగ్స్ మరియు ఓపెనింగ్, ఆడియో రిలీజ్ వంటి ఫంక్షన్స్ చేసుకునేందుకు కూడా వీలు కల్పిస్తున్నాము” అని అన్నారు!

Leave a Reply