ఉచిత మంచి నీటి సదుపాయం పొందేందుకు అధార్ లింకేజ్

– ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్
జల మండలి ద్వారా నెలకు 20 వేల కిలో లీటర్ల మేరకు ఉచితంగా మంచినీటి సదుపాయాన్ని పొందేందుకు పౌరులు ఆధర్ తో తమ వివరాలను అనుసంధానం చేసుకోవాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఈ నెల 31వ తేదీకి తుది గడువు విధించినందున ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తీగుల్ల పద్మారావు గౌడ్ శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్ధనగర్ మునిసిపల్ డివిజన్లలో ఆయా ప్రాంతాల జలమండలి అధికారులు ఈ ఆధర్ లింకేజ్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నారని అయన తెలిపారు. తమ క్యాన్ నెంబరును ఆధర్ తో సులభంగానే అనుసంధానం చేసుకోవచ్చునని, వివరాలకు సమీపంలోని జలమండలి కార్యాలయంలో గాని, టెలిఫోన్ నెంబరు 155 313 ద్వారా గాని సంప్రదించాలని పద్మారావు గౌడ్ సూచించారు

Leave a Reply