చంద్రూతో జగన్ మాట్లాడించినట్లుంది

– ఆయన వెనుక ఎవరున్నారో విచారించాలి
– లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు అమానవీయం
– రెడ్డి కాబట్టే ప్రేంచంద్రారెడ్డిపై కేసు పెట్టలేదా?
– ఎంపీ రఘురామ డిమాండ్
ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించిన చంద్రూగారిని ఒక్కరోజులో ఈ స్థితికి చేర్చి, అలాంటి మాటలు మా పార్టీ వాళ్లు మాట్లాడించినందుకు బాధపడాలా? చంద్రూగారిని చూసి జాలిపడాలా అన్నది అర్ధం కావడం లేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. జస్టిస్ చంద్రూ వ్యాఖ్యల వెనుక తమ వారి ప్రమేయం ఉన్నట్లుందని, సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆయనతో మాట్లాడించినట్లు అనుమానించాల్సి వస్తోందన్నారు. జస్టిస్ చంద్రూ తాడేపల్లి స్క్రిప్టు చదివినట్లు ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
‘జడ్జిలకు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వలేదు. డబ్బులుపెట్టి కొనుక్కున్నారు. దానిపై చంద్రూ అవగాహన లేకుండా మాట్లాడటమే నాకు ఆశ్చర్యంగా ఉంది. మరి ఏపీ హైకోర్టు జడ్జిలపై మా వాళ్లు సోషల్‌మీడియాలో తిడుతూ పోస్టింగులు పెట్టినప్పుడు, ఈ చంద్రూగారెక్కడికి పోయారో తెలియదు. శాసనసభ రాజ్యాంగానికి వ్యతిరేకంగా శాసనసభ చేసేవన్నీ అమలుచేయాలని, వాటిని కోర్టులు ప్రశ్నించకూడదన్నట్లు చంద్రూ చేసిన వ్యాఖ్యలు చేసిన చూస్తే, అసలు ఆయన జడ్జిగా అన్నాళ్లు ఎలా చలామణి అయ్యారో నాకర్ధం కాలేదు. ఆయనను చూస్తే జాలేస్తోం’దని అన్నారు.
అసలు చంద్రూ వెనుక ఎవరున్నారు? ఆయననకు మా ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎవరైనా కలిశారా? లేదా ఒక పదవి సరిపోక రెండు మూడు పదవులు తీసుకున్న తమిళనాడుకు చెందిన మాజీ న్యాయమూర్తి ప్రమేయం ఉందా? లేక మా ఎంపీలెవరైనా ఆయనను కలిశారా? వీటిపై విచారణ చేయాలి. పక్క రాష్ట్రానికి

చెందిన మాజీ న్యాయమూర్తిని తెచ్చి, మన న్యాయమూర్తులపై మాట్లాడించడం క్షమించరాని నేరం. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోంది. మానవహక్కులు లేవు. విశాఖలో డాక్టర్ సుధాకర్ చనిపోయారు. నేను బతికా. అంతే తేడా అన్నారు.
మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు పెట్టి వేధించడం దారుణమన్నారు. ఆ ఒప్పందంలో కీలక వ్యక్తులంతా ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉన్నా, వారంతా రెడ్డి కులానికి చెందిన వారయినందునే చర్యలు తీసుకోవడం లేదా అని రాజు ప్రశ్నించారు. సీఐడీ పోలీసులు అర్ధరాత్రి ఇళ్లపై దాడులు చేయడం అమానవీయమని, కోర్టులు ఎన్నిసార్లు తిట్టినా, డీజీపీని కోర్టుకు పిలిపించినా పోలీసులకు ఇంకా సిగ్గురాకపోవడం చూస్తే, వారి వెనుక ఎవరి దన్ను ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు.
జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంగా ఉన్నాయని తెలిపారు. జగన్ సర్కార్ తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలపై జస్టిస్ చంద్రు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవుపలికారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు కోర్టుల్లో నిలబడవన్న సంగతి జస్టిస్ చంద్రుకు ఎందుకు అర్థం కావడం లేదని ఎంపీ రఘురామ అన్నారు.

Leave a Reply