జగన్ ప్రభుత్వానికి ప్రజలు వన్ టైం సెటిల్మెంట్ చేసి సాగనంపుతారు

– టిడిపి నేత జీవి జోస్యం
జగన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు వన్ టైం సెటిల్మెంట్ చేసి సాగనంపుతారని నరసరావుపేట పార్లమెంటు టిడిపి అధ్యక ఆంజనేయులు జోస్యం చెప్పారు. మండల కేంద్రమైన నూజెండ్ల లో శనివారం చేపట్టిన ఆత్మగౌరవ యాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
జగన్ రెడ్డి ఇంకొక సారి అధికారంలోకి రావడం జరగదని స్పష్టం చేశారు. పేద,బడుగు,బలహీన వర్గాలను నమ్మించి ఒక్క సారి అధికారం ఇచ్చి చూడండి అంటూ ప్రజల రక్తం పిలుస్తున్నాడు అని విమర్శించారు. వన్టైమ్ సెటిల్మెంట్ పేరుతో పేదల దగ్గర దోపిడీకి ఈ ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఇచ్చిన ఇళ్లకు రెగ్యులరైజేషన్ పేరుతో రిజిస్ట్రేషన్లు చేస్తామని పేదలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని వివరించారు.
పెన్షన్లు, రేషన్ ఇవ్వమని కరెంటు కట్ చేస్తా మని బెదిరింపులకు దిగుతూ అక్రమ వసూళ్లకు ఈ ప్రభుత్వం పూనుకుందని ధ్వజమెత్తారు. రాబోయేది ప్రజా సంక్షేమ చంద్రబాబు పాలన అని మన ప్రభుత్వం వచ్చాక పేదల ఇళ్ల బకాయిలు అన్ని రద్దు చేసి రిజిస్ట్రేషన్లు చేస్తామని ఏ ఒక్కరు ఒక్క రూపాయి కూడా కట్టవద్దని ప్రజలను చైతన్యవంతం తో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాలని జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు.
ప్రజలకు కావాల్సిన కనీస వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని అభివృద్ధి లేకపోగా వినాశనానికి ఈ ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. అమరావతి రాజధాని విధ్వంసానికే మూడు రాజధానులను తెరపైకి తెచ్చారని జగన రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అవినీతి తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని పేదల ఇళ్ల స్థలాలను అడ్డుపెట్టుకొని పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో తన సొంత పొలంలో స్థలాలు ఇచ్చి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేశారని ఆరోపించారు.
నూజెండ్ల మండలంలో తంగిరాల డ్యాం నిర్మించి రైతులకు సాగు నీరు అందించి మేలు చేస్తానని ఎమ్మెల్యే ఇచ్చిన వాగ్దానం రెండున్నరేళ్లయినా అమలు కాలేదని ఇదీ మీరు చేసే అభివృద్ధి అని పోయి రోడ్లన్నీ గుంతల మయం అయి సప్టాలు ధ్వంసమై రహదారులన్నీ అస్తవ్యస్తమైన పట్టించుకునే నాథుడు కరువయ్యాడని విమర్శించారు. అకాల వర్షాలతో డ్యాములు అన్నీ నిండినా నూజెండ్ల మండలానికి సాగునీరు అందక పోవడం ఎమ్మెల్యే పనితీరును, ప్రభుత్వ పాలనను అన్ని వర్గాలు చిత్కరిస్తున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు నంబుల గురునాథం, కోటిరెడ్డి, గంగినేని ఆంజనేయులు, లగడపాటి వెంకటరావు, గంగినేని రాధాకృష్ణ,మీసాల మురళీ కృష్ణ యాదవ్, బచ్చు అంజిరెడ్డి, గంగినేని చంద్రశేఖర్, వంకాయలపాటి పేరయ్య, సోమేపల్లి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply