పోలవరం పరిహారం విషయంలో తమకు న్యాయం చేయాలని చంద్రబాబుకు వినతి

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి వచ్చిన టీడీపీ అధినేతకు గోకవరం లో వినతిపత్రం ఇచ్చిన రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన పోలవరం నిర్వాసితులు

• పోలవరం అనేది రాష్ట్రానికి వరం. 78 సార్లు పోలవరంపై సమీక్ష చేశాను. పనులు పరుగులు పెట్టించి 72 శాతం పోలవరం పూర్తి చేశాను.
• పోలవరం పూర్తి అయితే గోదావరి జిల్లా లలో మూడు పంటలకు నీళ్లు ఇవ్వొచ్చు.
• తెలుగు దేశం ప్రభుత్వం పోవడంతో పోలవరం గోదాట్లో కలిసిపోయింది.
• అధికారంలోకి వచ్చిన వెంటనే డబ్బులకు కక్కుర్తి పడి సీఎం జగన్ కాంట్రాక్టర్ ను మార్చేశాడు
• గోదావరి వరదలు వచ్చిన సమయంలో ప్రాజెక్ట్ వద్ద 16 నెలలు కాంట్రాక్టర్ లేరు…అధికారులు లేరు
• వరదల కారణంగా పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది.
• పోలవరంలో ఏజెన్సీలను మార్చవద్దు అని కేంద్రం చెప్పింది.పిపిఎ చాలా స్పష్టంగా రాష్ట్రానికి సూచనలు చేసింది. ఈ ప్రభుత్వం వినలేదు
• పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన దరిద్రులు వీళ్లు. చాలా బాధ అవేదన కలుగుతుంది.
• జగన్ చేసిన పనుల వల్ల పోలవరం నాశనం అయ్యింది.
• నిర్వాసితుల కోసం భూ సేకరణ లో ఎకరానికి రూ. 19 లక్షలు ఇస్తాను అని ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారు… ఇచ్చాడా?
• గతంలో పరిహారం ఇచ్చిన భూములు మళ్లీ ఎకరానికి రూ.5 లక్షలు ఇస్తాను అన్నాడు…ఇచ్చాడా?
• ఆర్ అండ్ ఆర్ 10 లక్షలు ఇస్తాను అన్నాడు ఇచ్చాడా?
• మనం కట్టిన నిర్వాసితుల కాలనీల్లో కనీసం వసతులు కల్పించలేదు
• సిఎం ఒక సైకో అయితే…..మంత్రులు కూడా అలాగే తయారు అయ్యారు.
• 41.5 మీటర్ల కే పోలవరాన్ని పరిమితం చేస్తాం అని జగన్ అంటున్నాడు. అంటే ధవళేశ్వరం బ్యారేజ్ లా పోలవరం బ్యారేజ్ కడతాడా?
•పైగా ఇప్పుడు మళ్లీ పోలవరంపై రీ సర్వే చేస్తాను అంటున్నాడు
• జగన్ చిన్న మొదడు చితికి పోయింది….పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ చేతిలో అధికారం
•నా బాధ నిర్వాసితుల కోసం…పోలవరం ప్రాజెక్టు కోసం. మళ్లీ నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత మేం తీసుకుంటాం
• ముంపు గ్రామాల్లో మొన్న వరదలకు కనీసం బాధితులకు భోజనం కూడా పెట్టని ప్రభుత్వం ఈ ప్రభుత్వం
• పోలవరంలో త్యాగాలు చేసిన ప్రజలకు న్యాయం చెయ్యాల్సిన అవసరం ఉంది. ముంపు ప్రాంతాల వారికి ప్రత్యేక జిల్లా చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం.
• రాబోయే రోజుల్లో ఇంటికి ఒకరు బయటకు వచ్చి…మీ భవిష్యత్ కోసం పోరాడాలి.
• నా పోరాటం ప్రజల కోసం….దానిలో ప్రజలు భాగస్వాములు కావాలి
• పోలవరం లో దొంగ పట్టాలు పెట్టి పరిహారం కొట్టేసే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత అన్నిటిపై విచారణ జరుపుతాం.
• ఇప్పుడు గృహ సారధులు అని వైసిపి వాళ్లు ఇంటింటికి వస్తున్నారు…జగన్ కే ఓటు వేస్తామని ఒట్టు వెయ్యాలట. మళ్లీ జగన్ కే ఓటేసి ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరేసుకోవాలా?
• ఎవరైనా జగన్ స్టిక్కర్ లు ఇంటికి అంటిస్తే అంగీకరించకండి. గృహ సారధులు ఇంటికి వస్తే సహకరించకండి. మీకు ఏమీ కాదు…నేను అండగా ఉంటా.
• గోకవరంలో డిగ్రీ కాలేజ్ కావాలి అన్నారు….ప్రభుత్వం వచ్చిన తరవాత కాలేజ్ ఏర్పాటు చెద్దాం.
రాష్ట్రం లో దరిద్ర మైన ప్రభుత్వం ఉంది.
కూలీ పనిచేసుకునే వారి నుంచి అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నాయి
ప్రజలు గమనించాలి…మీకు ఇచ్చేది 10. రూపాయలు…దోచేది రూ. 50 రూపాయలు.
ప్రజలపై 48 రకాల పన్నులు వేసిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి.
జగన్ పని అయిపోయింది .. ఓడిపోతున్నాడు.
గాలికి వచ్చిన పార్టీ గాలికే పోతుంది.
జగన్ సిగ్గులేకుండా కడపలో స్టీల్ ప్లాంట్ కు రెండో సారి భూమిపూజ చేశాడు
ఎన్నికలకు నేను సిద్దం…5 కోట్ల మంది ప్రజలు సిద్దం…సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదాం.

Leave a Reply