ఎల్బీ స్టేడియంలో వేగంగా క్రీడాకారుల హాస్టల్‌ ఆధునీకరణ

Spread the love

– మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశం

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఉన్న క్రీడాకారుల హాస్టల్ ను ఆధునీకరణ చేయడానికీ క్షేత్రస్థాయిలో క్రీడా శాఖ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ E. ఆంజనేయ గౌడ్ , గార్లతో కలిసి పరిశీలించారు. వచ్చే పదిహేను రోజుల్లో క్రీడాకారుల హాస్టల్ ఆధునీకరణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి క్రీడా శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రఖ్యాత లాల్ బహదూర్ స్టేడియం లో గ్రీనరీ ని పెంచాలని మంత్రి ఆదేశించారు స్టేడియంలోని ఫ్లడ్ లైట్ల టవర్స్ ను ఆధునికరించటానికి, అలాగే.., స్టేడియం కు కొత్తగా పెయింటింగ్ వేయడానికి అంచనాలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లాల్ బహదూర్ స్టేడియంలో క్రీడాకారులకు కనీస క్రీడా సౌకర్యాలు మెరుగుపరచాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ ఉన్నతాధికారులు ధనలక్ష్మి, సుజాత, అనురాధ, దీపక్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply