Suryaa.co.in

Entertainment

ప్యార్ హువా ఏక్ రార్ హువా..

అభిమాన అభినేత్రి నర్గీస్ దత్ జయంతి నేడు

ఆవారాతో తిరిగినా
శ్రీ 420 ని లవ్వాడినా..
తన అందంతో..
అభినయంతో
ప్రేక్షకులలో ఆగ్ పుట్టించినా..
ఆమె మదర్ ఇండియా!
నర్గీస్..
ఒక తరానికి ఆమె దేవత..
ప్రపంచ సినిమాకే
రా’రాజ్ కపూర్’
ఆమె అభినయానికి దాసోహం..
ఆమె కంటిచూపు కోసం
భుట్టో అంతటివాడే
స్టూడియోల ముందు
మునిమాపులు
పడిగాపులంట..
ఒకనాటి బాలీవుడ్ బాదుషాలే..
ఆ మత్తు కళ్ళ నిషాలో..
మునిగిపోయి హమేషా..
అదే ఆమె తమాషా..!

మదరిండియాలో నర్గీస్ నటనకు ఫిదా అయిపోయి
హోలిండియా..
థియేటర్లలో తాలియా..
ప్రతి ధియేటరు కన్నీటి కడలేనయా..!
ఆనాడే మగువా…మగువా
లోకానికి తెలుసా నీ తెగువా
అన్నట్టు ఆ తల్లి సాగించిన
పోరాటం..అభినయ కెరటం
‘అహ్’ అనిపించి..
సినిమా ‘తక్దీర్’ నే మార్చేసి..
ఆ సినిమాతో నర్గీస్
పెళ్ళికూతురై
షాదీ ‘మెహందీ..’
ఎక్కేసింది పల్లకీ ‘మేలా’!

ప్రపంచ సినిమా అభిమానికి
నర్గీస్ ఒక కల..
అలరించిన కళ..
పుత్రుడు సంజయుడు
బాధ మిగిల్చినా
పతి దత్ సాక్షాత్
ఆమెను దేవతలా ఆరాధించి
తన సతిని బలిగొన్న
క్యాన్సర్ పై సాగించి పోరు..
స్మృతి చిహ్నంగా ఆస్పత్రి నిర్మించి తాను తరించె!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE