ఆయన చెయ్యి పడితే తమిళం తెలుగైపోద్ది..!

ఆయన కలం తాకితే..
గుండె తడితే..
చెయ్యి పడితే
పరభాషా సినిమాలు
మాతృభాష సొగసులు అద్దుకుంటాయి…
పెదవుల కదలిక..
పదాల మెలిక..
పాటల అల్లిక..
అచ్చం మన మాతృకే..
కెవ్వు కేకే..!

రాజశ్రీ..
చలం సినిమాకి
అచ్చొచ్చింది ఆయన కలం
నిలిచిపోయే పాటలే కలకాలం…
చలం సంబరాల రాంబాబు అయితే మామా చందమామా వినరావా
నా కథ..
ఇలా వినిపించాడు వ్యధ,.
మట్టిలో మాణిక్యంగా
చలం మారితే..
మళ్ళి మళ్ళి పాడాలి
ఈ పాట…
నీ బ్రతుకంత కావాలి పూలబాట…
అంటూ వేశాడు హిట్టుబాట..
తియ్యని పాటలతో…
రాజశ్రీ రాసిన
కమ్మటి మాటలతో
కురిసింది వసూళ్ల వాన
ఆంధ్రా దిలీప్ ముంగిట్లోన..!

ఎక్కదో దూరాన కూర్చుని..
రాధకు నీవేర ప్రాణం
అంటూ వేసేశాడు
కలెక్షన్ల తులాభారం..
ప్రభుదేవా డాన్సింగ్ సంచలనం ప్రేమికుడు
ముక్కాలా ముకాబులా
లైలా..ఓ లైలా..
అంతా రాజశ్రీ లీల!

ఆ రోజుల్లో హిట్టయితే డబ్బింగ్ సినిమా..
అది రాజశ్రీ మహిమ..!

సురేష్ కుమార్ ఇ
9948546286

Leave a Reply