గిరీశం..జొన్నలగడ్డ ఇద్దరూ పుట్టింది ఒక్కచోటే

జయమ్ము నిశ్చయమ్మురా
భయమ్ము లేదురా…
జంకు గొంకు లేక సాగిపొమ్మురా.. సాగిపొమ్మురా..
ఈ పాటకు రమణమూర్తి
అభినయం స్ఫూర్తిదాయకం
ఇది సినిమా రంగంలో..

కన్యాశుల్కంలో గిరీశం..
పాత్రకు గురజాడ
ప్రాణం ఇస్తే..
జొన్నలగడ్డ ప్రాణం పోశాడు..
అదే పాత్ర సహస్ర కలశం..
గిరీశంలోకి పరాకాయప్రవేశం!
అన్న సోమయాజులుతో
కలిసి ఆడితే నాటకం..
తెలుగునాడు దిద్దింది
కళాతిలకం!

హీరోగా తెరంగేట్రం చేసినా ప్రమాదం వేసింది
కెరీరుకు బ్రేకు..
నటన మానవద్దన్న
అంతరంగం..
మళ్లీ స్వాగతించింది
తల్లి సినిమా రంగం!
నటనపై మమకారంతో
కూతురికి నటన అని
నామకరణం!
అలా తీర్చుకున్నాడు
కళామతల్లి రుణం!!

మంచైనా..చెడ్డ అయినా..
విశ్వనాధుడే కానీ..
దాసరే అవనీ..
నాన్న పాత్రకు రమణమూర్తి..
అదే ఆయన కీర్తి..
అలాగే కట్టి సిరిసిరిమువ్వ..
గోరింటాకు విలనీ పండించి
అన్ని రకాల పాత్రల పోషణలో వైవిధ్య నటనని
రంగరించి ఉన్నన్నాళ్లు
చేశాడు కళాసేవ..
అన్న సోమయాజులు
మాదిరి పాడుకుంటూ
దొరకునా ఇటువంటి సేవ!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply