Suryaa.co.in

Entertainment

పాత్రకు ప్రాణం పోస్తే అది అక్కినేని..!

ఎప్పటి సీతారామజననం
ఎక్కడ మనం..
ఈ రెంటి మధ్యనే
తెలుగు సినిమా గమనం..
మూకీలు ముగిసి టాకీలు మొదలైన టాలీవుడ్ లో
అక్కినేని ప్రవేశం
ఓ చారిత్రక సన్నివేశం..!

తొలినాళ్ళలో ఆయనకు పరిశ్రమ చిరునామా
తర్వాత ఆయనే అయ్యారు
పరి”శ్రమ”కు చిరునామా..
కళాఖండాలకు వీలునామా..!
ఆరడుగుల ఎన్టీఆర్ కు
పోటీ అయ్యాడు
ఈ నటనలో మేటి
ఇద్దరూ ఎవరికి వారే సాటి..
నందమూరి పౌరాణికుడైతే
అక్కినేని నటనకు
ప్రామాణికుడయ్యాడు..
ఆయన రాముని మించిన
రాముడనిపించుకుంటే
ఈయన రాముడు
కాదు కృష్ణుడు..
తాండవకృష్ణుడు..!

రెండు సినిమాల్లో
రామారావు కృష్ణుడై
ఒకేలాంటి నటనను ప్రదర్శిస్తే
మాయాబజార్లో అభిమన్యుడిగా
కృష్ణార్జునయుద్ధం లో కిరీటిగా
విభిన్న ప్రదర్శన అక్కినేనిది..
పాత్ర ఏదైనా ఆయన
అభినయం తిరుగులేనిది!

తొలితరం రొమాంటిక్ హీరో
నవలానాయకుడు..
భగ్నప్రేమికుడు..
భక్తి లేకపోయినా
తెరపై మహాభక్తుడు..
మందుకొట్టని
తాగుబోతు నటుడు..
ఆ లోతు కళ్ళు
వేయి భావాల ఆనవాళ్లు
నిషాకు నకళ్లు
భక్తి వాకిళ్ళు
రోషం ప్రదర్శిస్తే నిప్పురాళ్లు..
కోపం వర్షించే
తుపాకీ గుళ్ళు..
భాగ్యనగరిలో తెలుగు సినిమాకి పునాదిరాళ్ళు..!

పారూ..నాతో రాత్రికి రాత్రే
లేచి వచ్చేస్తావా
అన్న దేవదాసు..
నాగేశ్వర రావు
నటవిశ్వరూపానికి
పూర్తి డోసు..
లతా ఎందుకు చేసావీ పని..
అన్న ఒక్క డైలాగ్
సురేష్ ప్రొడక్షన్స్ కు
కలెక్షన్ల గని..
బెంగాలీ దేవదాసు
మొఘలాయి సలీం
గ్లాసు పడితే దేవదాసు
కలం పట్టితే కాళిదాసు
లేని మైకం నటిస్తూ
శ్రీదేవికి,జయసుధకు కలిపి చేశాడు ప్రేమాభిషేకం..
సావిత్రితో నాగ్గాడు జతకడితే
నిర్మాతలకు కనకాభిషేకం..

జగపతి సంస్థకు
జేబు నిండుగా
సురేష్ ప్రొడక్షన్స్
తన జేబు సంస్థగా
ఇల్లాలు అన్నపూర్ణ కి
ఆమె పేరిట పెట్టిన అన్నపూర్ణా సంస్థకు _వెలుగునీడ_ గా..
విరాజిల్లిన చక్రధారి..
ఎన్నో సంచలన
విజయాల సూత్రధారి..!
ఆయన నటించిన
ప్రతి శోక సన్నివేశం
మన కళ్లు వర్షించి
ఇచ్చే మేఘసందేశం..
స్టెప్పైనా..సిప్పైనా..
క్లోజప్పైనా..ఏ గెటప్పైనా..
అక్కినేని ఒక్కడికే నప్పేనా..
దిలీప్ కుమార్ అంతటివాడైనా
తన కంటే ఏయెన్నారే
గొప్పని ఒప్పుకోక తప్పేనా..
ఆయన మహానటుడని
జగమంతా పలికే..
అందుకే ఆయనయ్యాడు
దాదా సాహెబ్ ఫాల్కే..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE