ప్రతిపక్షాల నుంచి సైకిల్ పై పట్టేంత మంది గెలిస్తే చాలు

Spread the love

ఎంపీ విజయసాయి రెడ్డి

రాష్ట్ర అసెంబ్లీకి రానున్న 2024 ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని, ఒక సైకిల్ పై పట్టినంత మంది గెలిస్తే అది ఆ పార్టీకి ఎంతో గొప్ప విషయం అవుతుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సోమవారం పలు అంశాలు వెల్లడించారు.

సొంతింటితో పేదల జీవితాల్లో వెలుగులు
నవరత్నాలు పథకంలో భాగంగా సొంతింటి కళ నెరవేరిన పేదల జీవితాల్లో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. పేదల చిరకాల స్వప్నం సొంతింటి కళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెరవేరిందని చెప్పారు. గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో జగనన్న కాలనీలో నిర్మించిన ఇళ్లు చూస్తే ఆ లబ్దిదారులు ముఖాల్లో ఆనందాన్ని ఉహించుకోవచ్చని అన్నారు. నవరత్నాలు పథకంలో భాగంగా సొంతిల్లు పొందినందుకు ప్రతి పేదవాడు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కృతజ్ఞతా భావంతో ఉన్నారని అన్నారు.

స్థిరంగా ఏపీ ఆర్దిక వృద్ది
ఆర్థిక మందగమనం, వరుసగా రెండేళ్లపాటు కరోనా సంక్షోభ పరిస్థితులను అధిగమించి గత మూడేళ్లలో రాష్ట్ర ఆర్థిక నికర విలువ 37.28% మేర పెరిగిందని విజయసాయి రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి రూపొందించిన గణాంకాల నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అంశాలను వెల్లడించిందిని అన్నారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ఆర్దిక వృద్ది రూ.2.94 లక్షల కోట్లు పెరిగిందని అన్నారు.
వ్యవసాయ రంగంలో  రూ.3.72 లక్షల కోట్లు, రియల్ ఎస్టేట్ రంగంలో రూ.79,212 కోట్లు, తయారీ రంగంలో 84,134 కోట్లు ఆర్దిక వృద్ది నమోదయ్యిందని అన్నారు.

Leave a Reply