విరాట్ పురుషుడాతడు..!

నభూమి..నజలం చైవ నతేజో నచ వాయవః..
నచ బ్రహ్మ నచ విష్ణుః
న నక్షత్ర తారకః
సర్వ శూన్య నిరాంబం..
స్వయంభూ విశ్వకర్మనః..

పంచభూతాలు..
త్రిమూర్తులు..
ఉనికే లేని ఓ ముహూర్తాన
స్వయంభువుడై
ఉద్భవించినాడట విశ్వకర్మ..
సహస్ర శీర్షుడై..
జగమును తానే సృజియించగ..
ఈశ్వరుడై..పరమేశ్వరుడై..!

అతడే సగుణ బ్రహ్మ..
అంగుష్టమాత్రుడు..
జగద్రక్షకుడై..
వెలసినాడు ముల్లోకాల పూజలందగా..
ముక్కోటి దేవతల నీరాజనాలు అందుకొనగా..!

ఎన్నో నామముల వేలుపు..
త్వష్ణ పర్యాయపదమై
అసాధ్యాలను సుసాధ్యం చేసిన బ్రహ్మాండమే
విశ్వకర్మ విరాట్ స్వరూపం..!

నువ్వూ నేనూ కలలుగనే
సకల కళాస్వరూపం..
స్వర్గలోకం..
విశ్వకర్మ సృష్టి స్థితికి
విశ్వరూపం..
రావణుని మణిమయమకుట
అద్భుత సామ్రాజ్యం లంక
విశ్వకర్మ సిగలో నెలవంక..
కౌరవుల రాజధాని హస్తిన..
కౌంతేయుల కొలువు
ఇంద్రప్రస్థం..
ఈ విరాట్ పురుషుని
కల్పనా చమకృతికి
ఆనవాళ్ళు..!
ఇలా అద్భుతాల పరంపర..
విశ్వకర్మ విశేష కీర్తి..
అందుకున్నాడు
మూడు లోకాల
వేనవేల శ్లోకాల
నీరాజనాలు..!

విశ్వకర్మ సమారంభాం..
విశ్వరూపార్య మద్యమాం
వీరబ్రహ్మేంద్ర పర్యంతాం
వందే గురు పరంపరాం!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

Leave a Reply